సమ్మర్ కు షిఫ్ట్ అయిన రెండు టాలీవుడ్ చిత్రాలు

కరోనా కారణంగా ఈ ఏడాది మార్చ్ తర్వాత సినిమాలు ఏవీ విడుదల కాలేదన్న విషయం తెల్సిందే. ఈ నెలలోనే థియేటర్లు తెరుచుకోగా రెండో వారం నుండి తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ విడుదలవుతుంది. దీంతో టాలీవుడ్ కు కొంత ఊపు వస్తుందని చెప్పవచ్చు. జనవరి 1న ఒరేయ్ బుజ్జిగా సినిమా విడుదలవుతుంది.

ఇక తర్వాత సందడంతా సంక్రాంతిదే. నిజానికి సంక్రాంతి అనేది టాలీవుడ్ కు అతి పెద్ద పండగ. ఏటా వందల కోట్ల బిజినెస్ ఈ పండగకు జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2021 సంక్రాంతికి అంత ఆశాజనక పరిస్థితులు ఉంటాయా అంటే అనుమానమే.

అందుకే ముందు సంక్రాంతికి విడుదలను షెడ్యూల్ చేసుకున్న సినిమాలు కూడా ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడాక వకీల్ సాబ్ చిత్రాన్ని సంక్రాంతి నుండి సమ్మర్ కు షిఫ్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన చిత్రం కూడా మొదట సంక్రాంతికి విడుదల అని భావించినా ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా సమ్మర్ కే విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు.

ప్రస్తుతం సంక్రాంతి రేసులో రవితేజ క్రాక్, రామ్ రెడ్ సినిమాలు ఉన్నాయి.


Recent Random Post: