పవన్‌ కోసం బాహుబలి రైటర్‌ సిట్టింగ్స్‌

Share

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య ఖచ్చితంగా చెప్పలేనంతగా ఉన్నాయి. ఇప్పటికే వకీల్‌ సాబ్ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ ను సగం వరకు పూర్తి చేశాడు. ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలతో పాటు హరీష్‌ శంకర్‌ మరియు సురేందర్ రెడ్డిలతో కూడా పవన్‌ సినిమాలు చేయబోతున్నాడు. ఈ సినిమాలతో పాటు పవన్ మరి కొన్ని సినిమాలకు ఓకే చెప్పాడని అంటున్నారు.

పవన్‌ వరుస సినిమాల జాబితాలో ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్‌ కథతో చేయబోతున్న సినిమా కూడా చేరుతున్నట్లుగా సమాచారం అందుతోంది. పవన్ కోసం విజయేంద్ర ప్రసాద్‌ కథను సిద్దం చేశాడని ఇప్పటికే ఇతర రచయితలు మరియు ఇద్దరు ముగ్గురు దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది. దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు ఇలాంటి విషయాలు త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.


Recent Random Post: