మళ్లీ తెరపై పవన్ కల్యాణ్ – ఆలీ వినోదం

తొలిప్రేమ నుంచి కాటమరాయుడు వరకూ పవన్ కల్యాణ్ – ఆలీ కలిసి నటించారు. ఆలీ లేకుండా సినిమా చేయాలంటేనే ఏదోలా ఉంటుందని పవన్ కల్యాణే స్వయంగా చెప్పడం వీరిద్దరి మైత్రికి నిదర్శనం. అటువంటి వీరిద్దరి మధ్య పొలిటికల్ గా పొరపొచ్చాలొచ్చాయి. అటు తర్వాత దాదాపు వీరిద్దరూ కలిసింది లేదు. పవన్ వకీల్ సాబ్ లో కూడా ఆలీకి పాత్ర లేదు. దీంతో ఇక వీరిద్దరూ కలసి సినిమా చేయడం అసాధ్యమనే అనుకున్నారు.

కానీ.. ఇటివల ఓ పెళ్లి ఫంక్షన్ లో పవన్-ఆలీ కలసి సందడి చేశారు. పవన్ నేను కలిసే ఉన్నామని ఆమధ్య ఆలీ అన్నాడు. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసి నటిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు పవన్ సినిమాలో ఆలీకి మంచి పాత్ర దక్కిందని తెలుస్తోంది. తాను చేయబోయే తర్వాతి ప్రాజెక్టులో ఒక పాత్రకు పవనే స్వయంగా ఆలీ పేరు ప్రిఫర్ చేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ప్రేక్షకులకు మంచి వినోదం దక్కినట్టే.


Recent Random Post: