పవన్‌ కు జోడీగా ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం సాగర్‌ చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. మలయాళంలో సూపర్‌ హిట్ అయిన ఈ సినిమా కు తెలుగు లో పలు మార్పులు చేర్పులు చేసి రీమేక్‌ చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ తో పాటు ఈ రీమేక్ లో రానా హీరోగా నటిస్తున్న విషయం తెల్సిందే. పవన్‌ మరియు రానాలు కలిసి నటిస్తున్న ఈ సినిమాలో మొన్నటి వరకు సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు. కాని ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల పవన్‌ మూవీ నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

సాయి పల్లవి తప్పుకోవడంతో ఆమె స్థానంలో నిత్యా మీనన్ ను ఎంపిక చేశారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ సినిమా లో నిత్యా మీనన్‌ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని అంటున్నారు. సినిమా లో నిత్యా మాజీ నక్సలైట్‌ గా చాలా మాస్ గా కనిపించబోతుందట. గిరిజన మహిళ పాత్ర లో నిత్యా మీనన్ నటించబోతుంది. ఈ రీమేక్‌ లో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ ను ఎంపిక చేయడం సరైన నిర్ణయంగా అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: