ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హీరోయిన్ గా మొదటి సక్సెస్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు జోడీగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇన్ని రోజులు ఆ సినిమా విషయమై అధికారికంగా స్పందించేందుకు నో చెప్పిన నిధి అగర్వాల్ ఎట్టకేలకు స్పందించింది. తన జీవితంలోనే గొప్ప అవకాశం అంటూ ఆకాశానికి ఎత్తేసింది.
పవన్ కళ్యాణ్ వంటి గొప్ప స్టార్ తో హరి హర వీరమల్లు సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు నా కెరీర్ లో వచ్చిన ఆఫర్లలో ఇదే బిగ్గెస్ట్ ఆఫర్ గా చెప్పుకొచ్చింది. ఈ ఆఫర్ లైఫ్ టైమ్ గొప్ప అచీవ్ మెంట్ గా తాను భావిస్తున్నట్లుగా పేర్కొంది. పవన్ కళ్యాణ్ తో షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు వెయిట్ చేస్తున్నట్లుగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి అయినట్లుగా నిర్మాత ఏఎం రత్నం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా చిత్రీకరణ కోసం యూనిట్ సభ్యులు అంతా కూడా ఎదురు చూస్తున్నారని.. కాస్త పరిస్థితులు అనుకూలించిన వెంటనే షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెబుతున్నారు.
Recent Random Post: