అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీ క్వెల్ గా రూపొందుతున్న బంగార్రాజు సినిమా షూటింగ్ త్వరలో మొదలు అవ్వబోతుందని కొందరు.. ఇప్పటికే మొదలయ్యిందని కొందరు అంటున్నారు. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమాలో నాగచైతన్య మరియు సమంతలు నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు మరవక ముందే ఈ సినిమా లో ఐటెం సాంగ్ ను ఆర్ ఎక్స్ 100 బ్యూటీ ఆర్డీఎక్స్ బాంబ్ హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.
ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ గా మారిన ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసింది. కాని అవి నిరాశ పర్చడంతో ప్రస్తుతం ఆఫర్ల కోసం వెదుక్కుంటుంది. ఐటెం సాంగ్స్ తో కూడా ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్న ఈ అమ్మడికి ఈసారి కళ్యాణ్ కృష్ణ నుండి ఆఫర్ వచ్చిందట. ఆయన దర్శకత్వంలోనే బంగార్రాజు సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యిందో లేదో కాని పాయల్ మాత్రం త్వరలోనే ఐటెం సాంగ్ చిత్రీకరణ లో పాల్గొంటుందట.
Recent Random Post: