తమిళ సీనియర్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1 పాన్ ఇండియాగా సినిమాగా విడుదల కానున్న విషయం తెలిసిందే. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరపైకి వస్తున్న ఈ సినిమాను. లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని మణిరత్నం అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.
ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటించగా.. నందిని పాత్రలో ఐశ్వర్య రాయ్ నటీమ్చించారు.ఇక వంథియ దేవన్ గా మరో పవర్ఫుల్ క్యారెక్టర్ లో కార్తి నటించగా కుందవాయి గా త్రిష నటించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి క్రేజ్ అందుకుంది. అయితే ఈ సినిమా టీజర్ విడుదలయిన మొదటిరోజే కొన్ని ఆరోపణలు వచ్చాయి.
‘పొన్నియిన్ సెల్వన్’ లో చోళులను చాలా తప్పుగా చిత్రీకరించేలా సన్నివేశాలున్నాయంటూ కొంతమంది ప్రముఖులు ఆరోపిస్తున్నారు. సెల్వమ్ అనే న్యాయవాది ఈ సినిమాపై పలు రకాల ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎందుకంటే.. పోస్టర్లో ముందుగా విక్రమ్ ఆదిత్య కరికాలన్ పాత్రకు నుదుటిన తిలకం ఉందని.. అయితే చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్లో మాత్రం ఆదిత్య నుదుటిన తిలకం లేదని ఆరోపించారు.
ఇక సినిమాలో ఆదిత్య కరికాలన్ను తప్పుగా చూపించే అవకాశం ఉందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే తెలుగులో కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారు. మరి సినిమా ఎలాంటి విజయాన్ని ఎందుకుంటుందో చూడాలి.
Recent Random Post: