సౌత్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవలే ముంబయిలో ఒక ఇల్లు కొనుగోలు చేసింది. ఆ ఇంటిలోకి హిందూ సాంప్రదాయం ప్రకారం గృహ ప్రవేశం కూడా చేసింది. పూజా హెగ్డే పద్దతైన హిందూ సాంప్రదాయంలో గృహ ప్రవేశం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఇప్పటికిప్పుడు ముంబయిలో పూజా హెగ్డే ఇల్లు కొనేందుకు సిద్దం అవ్వడంకు కారణం ఏమై ఉంటుందా అంటూ నెట్టింట చర్చ మొదలైంది.
పూజా హెగ్డే ముంబయి ఇళ్లుకు ప్రథాన కారణం బాలీవుడ్ లో ఈ అమ్మడు సెటిల్ అవ్వాలని భావిస్తుంది.. అందుకే అక్కడే మకాం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇల్లు కొనుగోలు చేసి ఉంటుంది అనేది చాలా మంది అభిప్రాయం. ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అదే అనుకున్నారు. బాలీవుడ్ లో మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ ఫేమస్ అవుతున్న పూజా హెగ్డే ముందు ముందు బాలీవుడ్ కు పరిమితం అయ్యే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
ముంబయిలో ఇల్లు కొనడంకు బాలీవుడ్ సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చేసింది. తాను కేవలం తన కుటుంబ సభ్యులకు చేరువగా ఉండేందుకు ముంబయిలో ఇల్లు తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా ఒక ఇంగ్లీష్ డైలీతో మాట్లాడిన ఈ అమ్మడు ముంబయి ఇంటి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షూటింగ్ సందర్బంగా బిజీగా ఉండటంతో కుటుంబంతో గడిపే వీలు పడటం లేదు.
ముంబయిలో నా కుటుంబంతో నేను ఉన్నట్లయితే వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ఛాన్స్ ఉంటుంది. అంతే కాకుండా అమ్మకు వంటల్లో హెల్ప్ చేస్తూ సరదాగా ఆమెతో ముచ్చట్లు చెప్పుకోవచ్చు అన్నట్లుగా పూజా హెగ్డే అభిప్రాయం వ్యక్తం చేసింది. ముంబయిలో తన ఫ్యామిలీతో ఇకపై ఎక్కువ సమయం గడిపేందుకు వీలుగా కొత్త ఇల్లు ఉపయోగపడుతుందనే నమ్మకంను ఆమె వ్యక్తం చేసింది.
తన కొత్త ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంకు అతి కొద్ది మంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించాల్సి వచ్చింది. కరోనా వల్ల ఎక్కువ మందిని ఆ సమయంలో నేను ఆహ్వానించలేక పోయాను. సింపుల్ గా గృహ ప్రవేశం చేసిన నేపథ్యంలో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారని కూడా పూజా హెగ్డే ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇక పూజా హెగ్డే నటించిన సినిమా రాధేశ్యామ్ ఎట్టకేలకు విడుదల కాబోతుంది. వచ్చే నెలలో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా షురూ చేస్తున్నారు. రాధేశ్యామ్ తో పాటు తమిళ సూపర్ స్టార్ విజయ్ తో ఈ అమ్మడు కలిసి నటించిన బీస్ట్ కూడా సమ్మర్ లో విడుదల కాబోతుంది.
ఈ రెండు సినిమాలు కాకుండా చిరంజీవి ఆచార్య సినిమాలో చరణ్ కు జోడీగా గెస్ట్ రోల్ లో నటించింది. ఆ సినిమా కూడా సమ్మర్ లోనే విడుదల కాబోతుంది. ఈ మూడు సినిమాలు కాకుండా ఇటీవలే సూపర్ స్టార్ సినిమా కు కమిట్ అయ్యింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఉంది. బీస్ట్ విడుదల తర్వాత తమిళంలో సినిమా లకు సైన్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Recent Random Post: