హాట్ బ్యూటీ పూజా హెగ్డే ను సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. పూజా తాజాగా చేసిన వ్యాఖ్యలు మహేష్ బాబును అగౌరవ పర్చే విధంగా ఉన్నాయంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వయసు లో పెద్ద.. స్టార్ డమ్ లో సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు విషయంలో పూజా హెగ్డే వ్యవహరించిన తీరు మరియు ఉపయోగించిన భాష ఏమాత్రం సమంజసం గా లేదని మహేష్ అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ను గౌరవం లేకుండా సంబోధించింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. అసలు విషయం ఏంటీ అంటే ఇటీవల ఒక సందర్బంగా పూజా హెగ్డే స్పందిస్తూ.. ప్రస్తుతం నేను మహేష్ బాబు తో ఒక సినిమాను చేస్తున్నాను.. అది గతంలోనే ప్రకటించడం జరిగిందని వ్యాఖ్యలు చేసింది.
మహేష్ బాబు ను హీరోయిన్ పూజా హెగ్డే కనీసం గౌరవం లేకుండా మాట్లాడటం ఏమాత్రం బాగాలేదు. సర్ అని లేదా గారు అని మహేష్ బాబును ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. కాని పూజా హెగ్డే మాత్రం ఏక వచనంతో మహేష్ తో సినిమా చేస్తున్నాను అన్నట్లుగా పేర్కొనడం ఆమె తల బిరుసుకు నిదర్శణం అన్నట్లుగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజా హెగ్డే ఇండస్ట్రీలో పెద్దలను స్టార్స్ ను గౌరవించడం నేర్చుకోవాలంటూ అంతా సూచిస్తున్నారు.
పూజా హెగ్డే విషయంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ పై ఆమె అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. చిన్న విషయాన్ని ఎందుకు పెద్దగా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. పెద్ద ఎత్తున పూజా హెగ్డేకు దక్కుతున్న అభిమానం మరియు స్టార్ డమ్ ను కొందరు తట్టుకోలేక యాంటీ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారంటూ వారు కొత్త వాదన మొదలు పెట్టారు. మొత్తానికి వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.
ఇక మహేష్ బాబు కు జోడీగా నటించబోతున్న పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా లో నటిస్తుంది. తమిళంలో ఈమె విజయ్ తో కలిసి నటించిన బీస్ట్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు రాధేశ్యామ్ తో ఈమె త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. బీస్ట్ మరియు రాధేశ్యామ్ సినిమాలు రెండు కూడా సక్సెస్ అయితే ఈమె కెరీర్ మరో అయిదు సంవత్సరాల పాటు టాప్ రేంజ్ లోనే దూసుకు పోయే అవకాశం ఉంటుంది. మహేష్ బాబు.. త్రివిక్రమ్ ల కాంబోలో నటించబోతున్న పూజా హెగ్డే పాత్ర గురించి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
Recent Random Post: