పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన `రాధేశ్యామ్` మార్చి 11న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి ఇంకా మూడు రోజులే సమయం ఉంది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. తొలి షో ఎప్పుడు చూద్దామా? అన్న ఎగ్జై ట్ మెంట్ రెట్టింపు అవుతోంది. కౌంట్ డౌన్ గంటల్లో మొదలవ్వడంతో ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతుంది. దీంతో అభిమానుల నుంచి మేకర్స్ కి తీవ్రమైన ఒత్తిడి సైతం ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది.
మార్చి 11కి ముందుగానే మార్చి 10వ తేదీ సాయంత్రం నుంచే తెలుగు రాష్ర్టాల్లో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలు వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అభిమానుల ఎగ్జైట్ మెంట్ లో తప్పులేదు. మేకర్స్ ప్రభుత్వం అనుమతులు తీసుకుని వేసే అవకాశం ఉంది. తద్వారా రిలీజ్ కి ముందే భారీ ఓపెనింగ్స్ దక్కుతాయి.
వీలైనంత త్వరగా సినిమా చూడాలన్న కుతుహలంలోనే అభిమానులు ప్రీమియర్ కి డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఎదురుచస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి ఢోకాలేదు. భారీగానే ఓపెనింగ్స్ దక్కుతాయి. అయితే దర్శక-నిర్మాతలు ఆ దిశగా ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది. అందుకు గల కారణాలు పక్కనబెడితే ఇది రెగ్యులర్ కమర్శియజ్ సినిమా కాదు. డిఫరెంట్ జానర్ లవ్ స్టోరీ. 1970-80 కాలం నాటి పిరియాడిక్ లవ్ స్టోరీ.
ఇందులో ట్విస్టులు కథని మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్ర్కీన్ ప్లే కూడా గ్రిప్పింగ్ టఫ్ గా ఉంటుంది. సినిమా లో యాక్షన్ సన్నివేశాలు చాలా పరిమితంగానే కనిపిస్తున్నాయని రెండు ట్రైలర్లతోనే అర్ధమవుతోంది. లవ్ స్టోరీనే సినిమాలో ప్రధానంగా హైలైట్ అవుతున్నట్లు ప్రచార చిత్రాల ద్వారా అద్దం పడుతుంది. ఓ రకంగా ఇది ప్రయోగాత్మక చిత్రంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సినిమాకి పెయిడ్ ప్రీమియర్ లు వేస్తే రిలీజ్ కి ముందే టాక్ బయటకు వచ్చేస్తుంది.
పాజిటివ్ టాక్ వస్తే పర్వాలేదు…అలాకాని పక్షంలో సినిమా ఫుల్ రన్ పై ఆ ప్రభావం పడుతుందన్న గుసగుస వినిపిస్తోంది. వీటన్నింటిని బేరీజు వేసుకునే మేకర్స్ పెయిడ్ ప్రీమియర్లవైపు అభిమానులు డిమాండ్ చేస్తున్నా మొగ్గు చూపడం లేదని టాక్ వినిపిస్తోంది. వాటికి తోడు రివ్యూలు కూడా నెట్టింట వైరల్ గా మారతాయి. సినిమా రివ్యూని ఎవరికి వారే ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రీమియర్ లతో జరభద్రంగా ఉండటమే ఉత్తమం అని కూడా వెనక్కి తగ్గుతూ ఉండొచ్చు.
ఏది ఏమైనా రిలీజ్ కి ఇంకా మూడు రోజులు గడువు ఉంది. కాబట్టి అభిమానుల కోరిక మేరకు పెయిడ్ ప్రీమియర్ కి మేకర్స్ అనుమతులు తెచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. సెకెండ్ ట్రైలర్ రిలీజ్ తో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్నంటడం మొదలైంది. విజువల్ ట్రీట్ ప్రేక్షకుల్ని తప్పక అలరిస్తుందని టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది . మరోవైపు సినిమాకి భారీ ప్రచారం కల్పిస్తూ మంచి బజ్ ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.
Recent Random Post: