రెబెల్ స్టార్ ప్రభాస్ భారీ అప్పుల్లో కూరుకుపోయాడా? అవి దాదాపు 1000 కోట్లకు పైమాటేనా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానమే వస్తోంది. ప్రభాస్ కు వి సెల్యులాయిడ్స్, యూవీ క్రియేషన్స్ లో భారీగా పెట్టుబడులు ఉన్నాయి.
గతేడాది లాక్ డౌన్ కారణంగా ఇండస్ట్రీ దారుణంగా నష్టపోయింది. వేల కోట్ల నష్టాలను ఇండస్ట్రీ చవిచూసింది. దాదాపు ఏడు నెలల పాటు షూటింగ్స్ సాగలేదు, ఎనిమిది నెలల తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ కు సంబంధించిన యూవీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ దారుణంగా నష్టపోయినట్లు తెలుస్తోంది.
నిర్వహణ ఖర్చులు, ఉద్యోగులకు జీతాలు, ప్రీ ప్రొడక్షన్ పనులు, కరెంట్ బిల్స్ ఇలా అన్నీ కలుపుకుని భారీ అప్పులే అయ్యాయని, వాటికి వడ్డీలు కూడా వేసుకుంటే దాదాపు 1000 కోట్లకు లెక్కలు తేలతాయని సమాచారం. మరి తన బిజినెస్ పార్ట్నర్స్ తో కలిసి ప్రభాస్ ఈ అప్పుల ఊబిలోనుండి ఎలా బయటపడతాడో చూడాలి.
Recent Random Post: