రాధే శ్యామ్ సినిమా కూడా వాయిదా బాట పడుతోందా?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఇంకా ఒక్క పాట మిగిలుంది. ఈ సినిమా జులై 30న విడుదలవుతుందని ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు. అప్పటికి షూటింగ్ పూర్తవుతుంది కానీ సినిమా విడుదలవుతుందా అన్నది ప్రశ్నర్ధకంగా మారింది. ఇప్పటికే లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం వంటి సినిమాలు వాయిదా పడ్డాయి.

ఇక నారప్ప, ఆచార్య చిత్రాల విడుదల తేదీలు కూడా వాయిదా పడనున్నాయి. మరి రాధే శ్యామ్ పరిస్థితి ఏంటి? ఈ చిత్రానికి తెలుగు మార్కెట్ ఒక్కటే కాదు నార్త్ కూడా చాలా ముఖ్యం. ప్రభాస్ గత మూడు సినిమాలు అక్కడ 100 కోట్ల కలెక్షన్స్ ను సాధించాయి.

మరి అప్పటికి నార్త్ లో అంతా సర్దుకుంటుందా? సర్దుకున్నా కూడా అప్పటికే వాయిదా పడ్డ సినిమాలతో పోటీ పడాల్సి వస్తుందా? రాధే శ్యామ్ పరిస్థితి ఏంటో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.


Recent Random Post: