ప్రభాస్ తో ధూమ్ 4 చేయట్లేదా?

Share

రెబెల్ స్టార్ ప్రభాస్ కు ఇప్పుడు నేషన్ వైడ్ క్రేజ్ ఉన్న విషయం తెల్సిందే. ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలకు కమిటై ఉన్నాడు. రాధే శ్యామ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఆది పురుష్, సలార్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయాల్సిన సైన్స్ ఫిక్షన్ చిత్రం వచ్చే ఏడాది మొదలవుతుంది.

ఇక ప్రభాస్ ను విలన్ గా పెట్టి ధూమ్ 4 ను తీయాలని నిర్మాత ఆదిత్య చోప్రా ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభాస్ ధూమ్ 4 కాకుండా మిగిలిన ప్రాజెక్ట్స్ ను మొదలుపెట్టాడు. ఎంతకూ ప్రభాస్ నుండి ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో ఆదిత్య చోప్రా ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ధూమ్ 4 లో ప్రభాస్ ను తీసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నాడు. జాన్ అబ్రహం, హ్రితిక్ రోషన్, ఆమిర్ ఖాన్ ధూమ్ మొదటి 3 సిరీస్ లలో నటించిన విషయం తెల్సిందే.


Recent Random Post: