ప్రభాస్-మారుతి ముహూర్తం ఫిక్సైంది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ కాంబినేషన్ లో చిత్రం ఉంటుందని ప్రచారం సాగుతోంది. `బాహుబలి` రిలీజ్ దగ్గర నుంచి ఈ కాంబినేషన్ పేరు చిలవలు పలవులుగా తెరపైకి వస్తోంది. ఇక `సాహో` తర్వాత మరింత ప్రచారంలోకి వచ్చింది. `రాధేశ్యామ్` తో దాదాపు ఖరారు చేసినట్లు అయింది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే ఈ కాంబినేషన్ లో చిత్రం లాంచ్ అవుతుందని జోరుగా ప్రచారం సాగింది.

అయితే అదే సమయంలో డార్లింగ్ `సలార్`..`ఆదిపురుష్` లాంటి చిత్రాల్ని సెట్స్ పైకి తీసుకెళ్లడంతో మారుతి వెయిట్ చేయాల్సి వచ్చింది. చివరిగా మారుతి టైమ్ కూడా వచ్చేసింది. ఎట్టకేలకు ఆ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించి లాంఛింగ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 10న చిత్రాన్ని హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభిచాలని ముహూర్తం ఫిక్స్ చేసినట్లు క్లోజ్ సోర్సెస్ చెబుతున్నాయి.

అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి `డీలక్స్ రాజా` అనే టైటిల్ తో తెరకెక్కుతుందని వార్తల్లొకి వచ్చింది. కంప్లీట్ గా మారుతి మార్క్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ప్రభాస్ మ్యాన్లీ లుక్ కి మారుతి కథకి పూర్తి నాన్ సింక్ గానే కథ సాగుతుందని సమాచారం.

ప్రభాస్ కటౌట్ ని పక్కనబెట్టి కేవలం మారుతి యాంగిల్ లోనే సినిమా చూడాల్సి ఉంటుందని సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. మరి వాటన్నింటిపై క్లారిటీ రావాలంటే కొంచెం సమయం పడుతుంది. మరి ఇందులో హీరోయిన్ ఎవరు? నిర్మాణ వ్యయం ఎంత? పాన్ ఇండియా కేటగిరీలోనే తెరకెక్కిస్తారా? తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` ఇటీవలే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. యూవీ క్రియేషన్స్ ఈ సినిమా కోట్ల రూపాయలు వెచ్చించింది. పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిల పడింది. ఈ దెబ్బ నిర్మాణ సంస్థకి కోలుకోలేనిదిగానే చెప్పాలి. ప్రస్తుతం ఆ సంస్థ వేర్వేరు హీరోలతో సినిమాలు చేస్తోంది. ఆ నష్టాల్ని వాటి రూపంలో భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ `సలార్` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. `కేజీఎఫ్` ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.


Recent Random Post: