రామ్ చరణ్‌కు అడుగడున అడ్డు పడుతున్న ప్రభాస్..


    అవును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అడుగడుగున అడ్డుపడుతున్నాడు. ప్రభాస్ ఏంటి రామ్ చరణ్‌కు అడ్డుపడటం ఏంటి అనుకుంటున్నారా అని ఆశ్చర్యపోతున్నారా ? వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా రామ్ చరణ్.. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ‘మిర్చి’ సినిమా తర్వాత రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్‌లో బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత ఎందుకనో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కొరటాల శివ.. మహేష్ బాబు‌తో‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ సినిమాలు చేసాడు. ఆ తర్వాత మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో రామ్ చరణ్, కొరటాల శివ సినిమా ఓకే అయింది కానీ ఇప్పటి వరకు సెట్ పైకి వెళ్లలేదు. తాజాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కోసం రామ్ చరణ్ ఇచ్చిన డేట్స్‌ను తండ్రి చిరంజీవి సినిమా కోసం కేటాయించాడు. ఆచార్య పేరుతో తెరకెక్కతున్న ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్స్ ఇవ్వడంతో త్వరలోనే ఆచార్య సినిమా పట్టాలెక్కనుంది.

    ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తాడనుకుంటే.. రాజమౌళి మాత్రం ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అయ్యేంత వరకు వేరే సినిమాలేని చేయోద్దని కండిషన్ పెట్టాడు. ముందు ఒప్పుకున్నా.. లాక్‌డౌన్ కారణంగా రామ్ చరణ్ డేట్స్ పూర్తిగా ఆర్ఆర్ఆర్‌కే కేటాయించాల్సి రావడం మరో కారణం. ప్రభాస్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కొరటాల శివతో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. రాధాకృష్ణ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా తర్వాత ఇప్పటికే కొరటాల శివ‌ను తన సినిమా కోసం లాక్ చేసినట్టు సమాచారం.

    ప్రభాస్ కూడా ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్‌తో‘సాహో’ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నా ఈ చిత్ర కథపై ప్రభాస్ అనుమానంగా ఉన్నట్టు సమాచారం. అందుకే రాధాకృష్ణ సినిమా తర్వాత వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందిరి సినిమాకు సీక్వెల్ అని చెబుతున్నారు. చిరంజీవి నటించిన అలనాటి సూపర్ హిట్ సినిమాను రామ్ చరణ్ చేస్తే అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. కానీ ఇపుడు అశ్వనీదత్, నాగ్ అశ్విన్‌లు జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్‌ను ప్రభాస్‌తో తెరకెక్కిద్దామనుకుంటున్నారు. నాగ్ అశ్విన్ సినిమా ఈ యేడాది అక్టోబర్‌లో కానీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి రామ్ చరణ్ చేద్దామనకున్న జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్‌ను ఇపుడు ప్రభాస్ చేస్తూ ఉంటడంతో రామ్ చరణ్‌ ఉసురు మంటున్నాడు. ఈ రకంగా రామ్ చరణ్ కలను ప్రభాస్ చెడగొట్టాడనే చెప్పాలి. మొత్తానికి ప్రభాస్‌తో నాగ్ అశ్విన్.. జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ చేస్తున్నాడా లేదా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఏమైనా రామ్ చరణ్ చేయాలనుకున్న ప్రాజెక్ట్స్‌ను ఈ రకంగా ప్రభాస్ ఎగరేసుకుపోవడం మెగాభిమానులకు రుచించడం లేదు.


    Recent Random Post: