తల్లి ప్రేమను గుండెలపై అమరం చేసిన బాలీవుడ్ నటుడు

ఏ వ్యక్తికైనా అమ్మ ప్రేమను మించింది లేదు. అమ్మ నిస్వార్ధపూరితమైన ప్రేమకు మించినది ఏదీ ఈ లోకంలో లేదు. అమ్మ ప్రేమను నోచుకోని వారు దానికోసం ఎప్పటికీ పరితపిస్తూ ఉంటారు. ఈ కోవకే చెందుతాడు బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్.

ముంబై సాగా, జానే తూ యా జానే నా, దమ్ మారో దమ్, ఏక్ దీవానా తా వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ బబ్బర్ నిజ జీవితంలో తల్లి ప్రేమకు నోచుకోలేదు. ప్రతీక్ తల్లి స్మిత పాటిల్ తనకు 31 ఏళ్ల వయసులోనే ప్రతీక్ కు జన్మనిచ్చిన రెండు వారాలకే కనుమూసింది.

కనీసం తల్లి చేత గోరుముద్దలు తినే భాగ్యం కూడా దక్కించుకోలేని ప్రతీక్ ఇప్పటికీ తన తల్లిని మిస్ అవుతున్నాడు. అందుకే ఆమె పేరుని తన ఎదపై టాటూ వేయించుకున్నాడు. ఆమె పుట్టిన సంవత్సరం కూడా వేయించుకున్న ప్రతీక్, చనిపోయిన సంవత్సరానికి బదులుగా ఇన్ఫినిటీ గుర్తుని, అంటే తన తల్లి ఎప్పటికీ తన గుండెలపై ఉంటుందని తెలియజేస్తున్నట్లుగా టాటూ వేయించుకున్నాడు.


Recent Random Post: