వంటలక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది నటి ప్రేమీ విశ్వనాధ్. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్కగా కనిపిస్తోన్న ప్రేమీ విశ్వనాథ్ ఒక హీరోయిన్ కు సమానమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే సీరియల్ లో రాణిస్తున్న ఈమెకు గతంలో పలు సినిమా ఆఫర్లు వచ్చాయి కానీ వాటిని కాదనుకుంది.
కానీ ఇప్పుడు వెండి తెర డెబ్యూకు సిద్ధమైంది ఈ నటి. రీసెంట్ గా ఉస్తాద్ రామ్ పోతినేని లింగుసామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం ప్రేమీ విశ్వనాథ్ ను అప్రోచ్ అవ్వగా కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Recent Random Post: