సక్సెస్ లేకున్నా ఆఫర్లు బాగానే ఉన్నాయి

మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియా సెన్షేషన్. తన ముద్దు గన్ను మరియు కన్న కొట్టే క్లిప్స్ తో దేశ వ్యాప్తంగా ప్రియా ప్రకాష్ వారియర్ స్టార్ గా నిలిచి పోయింది. అయితే ఆమె మొదటి సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమెను జనాలు పట్టించుకోరేమో అని అంతా అనుకున్నారు. కాని ఆమెకు ప్లాప్ పడ్డా ఆమె సోషల్ మీడియా క్రేజ్ నేపథ్యంలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆమెతో వర్క్ చేసేందుకు ముందుకు వచ్చారు. కాని ఆమె మాత్రం ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉంది. హీరోయిన్ గా తెలుగు లో ఇప్పటికే రెండు సినిమాలతో వచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేదు.

హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ కెరీర్ ను చూస్తే చాలా మందికి ఆశ్చర్యం కలుగక మానదు. ఎందుకంటే ఆమె ఏ భాషలో కూడా ఇప్పటి వరకు మంచి సక్సెస్ కొట్టిందే లేదు. అయినా కూడా ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈమె ఒకటి రెండు సినిమాలు చేస్తుందని.. త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను మేకర్స్ వెళ్లడించబోతున్నట్లుగా చెబుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లేని హీరోయిన్స్ ను జనాలు పెద్దగా పట్టించుకోరు. కాని ఈమె విషయంలో మాత్రం అది నిజం కాదు అనిపిస్తుంది. సక్సెస్ లేకున్నా కూడా ప్రియా ప్రకాష్ వారియర్ కు మంచి ఛాన్స్ లు అయితే వస్తున్నాయి.

హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ కు ఎందుకు ఇంతగా ఆఫర్లు వస్తున్నాయి అనేది కొందరి అనుమానం. అయితే ఆమె కు సినిమాలు సక్సెస్ కాకున్నా కూడా ఆ ముద్దుగన్ను మరియు కన్నుగీటిన క్రేజ్ తగ్గలేదు. దానికి తోడు ఆమె పారితోషికం చిన్న సినిమాల నిర్మాతలకు కూడా అందుబాటులో ఉంది. ఆమె పారితోషికంను భారీగా పెంచకుండా ఆకాశంలో నిలువకుండా కిందనే ఉండటం వల్ల ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి అనేది విశ్లేషకుల అభిప్రాయం. సక్సెస్ లేకున్నా పారితోషికం పెంచితే ఆమెను ఎవరు పట్టించుకునే వారు కాదు. ఆమె పారితోషికం తక్కువగా ఉండటమే ఆమెకు ప్లస్ అయ్యింది అనేది కొందరి వాదన. ఇప్పుడు కాకున్నా తర్వాత తర్వాత అయినా ఆమెకు ఒక మంచి హిట్ పడుతుంది అనేది కొందరి నమ్మకం.. అందుకే ఆమెను తమ సినిమాల్లో నటింపజేస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


Recent Random Post: