ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంకు రోజులు దగ్గర పడ్డాయి. ఈనెల 26వ తారీకున ఈ అతి పెద్ద అవార్డు ఉత్సవం జరుగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈసారి ఇండియన్ సినిమా ది వైట్ టైగర్ కు ఆస్కార్ ఊరిస్తోంది. ఆస్కార్ అవార్డు పోటీలో ఈ సినిమా టాప్ ప్లేస్ లో ఉంది. ఇండియా అమెరికన్ సినిమా అయిన ఈ సినిమా చాలా విభిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందంటూ ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
అమెరికాలో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ దక్కించుకున్న ది వైట్ టైగర్ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్పా నటించగా కీలక పాత్రలో రామ్ కుమార్ రావు మరియు ఆదర్శ్ గౌరవ్ లు నటించారు. ఈ సినిమాకు అమెరికన్ దర్శకుడు రామిన్ బహ్రాని దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ నిర్మాత ముఖుల్ డియోరా ఈ సినిమాను నిర్మించాడు. నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉండటంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ఇరవై ఏళ్ల తర్వాత ఇండియన్ మూవీ ఆస్కార్ తుది బరిలో నిలవడం చర్చనీయాంశంగా ఉంది.
Recent Random Post: