PS : మనోళ్లు ఒప్పుకోక పోవడమే మంచిదైంది

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చాలా సంవత్సరాలుగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఎట్టకేలకు రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి పార్ట్ గత ఏడాది లో ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండో పార్ట్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు పార్ట్ లకు తమిళనాట పాజిటివ్ రెస్పాన్స్ దక్కిన విషయం తెల్సిందే.

పొన్నియిన్ సెల్వన్ రెండు పార్ట్ లను కూడా తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. మణిరత్నం అభిమానులు కూడా పొన్నియిన్ సెల్వన్ సినిమాను లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో విక్రమ్.. కార్తీ.. జయం రవి.. ఐశ్వర్య రాయ్.. త్రిష ఇంకా పలువురు ప్రముఖ నటి నటులు నటించారు. కానీ ఏ ఒక్కరికి కూడా వావ్ అనిపించేంత కథలో ప్రాముఖ్యత దక్కినట్లుగా అనిపించలేదు.

స్టార్స్ అందరికి కూడా సమానమైన స్క్రీన్ స్పేస్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మణిరత్నం ఏ ఒక్కరి పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేక పోయాడు అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాను తమిళ స్టార్స్ తో పాటు తెలుగు స్టార్స్ తో కలిపి చేయాలని మణిరత్నం భావించాడు.

తెలుగు లో మహేష్ బాబు.. రామ్ చరణ్ మొదలుకుని పలువురు స్టార్స్ ను సంప్రదించాడు అనే వార్తలు వచ్చాయి. కానీ ఏ ఒక్కరు కూడా పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. సినిమా రెండు పార్ట్ లు కూడా విడుదల అయిన తర్వాత తెలుగు ప్రేక్షకులు మన హీరోలు పొన్నియిన్ సెల్వన్ ను కమిట్ అవ్వక పోవడమే మంచిది అయ్యిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పొన్నియిన్ సెల్వన్ లో ఏ ఒక్కరికి కూడా సరైన ప్రాముఖ్యత లేకపోవడం వల్ల కూడా ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. తమిళం కు చెందిన కథ అవ్వడంతో పాటు ఇతర కారణాల వల్ల తమిళ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తున్నారు కానీ తెలుగు మరియు ఇతర భాషల ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. తెలుగు హీరోలు నటించినా కూడా ఇదే పరిస్థితి ఉండేది.

మణిరత్నం ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసిన విషయం తెల్సిందే. ఆయన దర్శకత్వంలో నటించాలని ఎంతో మంది స్టార్స్ కూడా భావిస్తూ ఉంటారు. ఆయన దర్శకత్వంలో నటించాలని తెలుగు హీరోల్లో చాలా మంది అనుకుంటారు.

కానీ పొన్నియిన్ సెల్వన్ సినిమా కథ చెప్పిన తర్వాత ఇది తెలుగు లో వర్కౌట్ అయ్యేది కాదని ముందే ఊహించి నో చెప్పినట్లుగా తెలుస్తోంది. మణి సార్ తదుపరి సినిమా కమల్ హాసన్ తో చేయబోతున్న విషయం తెల్సిందే.


Recent Random Post: