పూరి జగన్నాధ్ మామూలోడు కాదు.. ‘పూరి మ్యూజింగ్స్’తో కూడా రికార్డులే..

సూటిగా.. సుత్తి లేకుండా.. అని ఓ యాడ్ లో డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ పూరి జగన్నాధ్ కు సరిగ్గా సరిపోతుంది. ఆయన సినిమాల్లోని సన్నివేశాలు, డైలాగులు చూస్తే ఇది నిజమే అనిపించక మానదు. కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ టైమ్ లో ఖాళీగా ఉండకుండా కొత్త ఆలోచన చేశాడు. ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో తన ఆలోచనలు, కొత్త విషయాలను చెప్పాలని అనుకున్నాడు. ఇందుకు పోడ్ క్యాస్ట్, స్పాటిఫై, యూ ట్యూబ్ చానెల్స్ ద్వారా చిన్న చిన్న ఎపిసోడ్స్ ను రిలీజ్ చేశాడు. ఇప్పుడవి రికార్డులు క్రియేట్ చేశాయి.

టాప్ 2020 పోడ్ క్యాస్టర్ గా పూరి మ్యూజింగ్స్ రికార్డులు క్రియేట్ చేశాయి. స్పాటిఫై ఇండియాలో పూరి మ్యూజింగ్స్ 65 దేశాల్లో ప్లే అయి రికార్డులు క్రియేట్ చేశాయి. మొత్తం 540 నిమిషాల నిడివితో 152 ఎపిసోడ్స్ గా వీటిని రిలీజ్ చేశాడు పూరి. మూడు దేశాల్లో 104 రోజులపాటు చార్ట్స్ లో టాప్ పొజిషన్ లో నిలిచాయి. మొత్తంగా 68,193 మంది పూరి మ్యూజింగ్స్ విన్నారు. పోడ్ క్యాస్ట్స్ లో ఇదే హయ్యస్ట్ రికార్డ్ గా నిలిచాయి. ప్రపంచంలోని అనేక విషయాలను చెప్పాడు. వీటిని విన్నవారు.. ‘నిజామా.. అబ్బో.. వారెవా’ అని అనుకోకుండా ఉండరు.

పూరి మ్యూసింగ్స్ ను 5-6 నిముషాల్లోనే ముగించేస్తాడు. ‘బోర్ కొడుతుంది అని మీకు అనిపించేలోపే నేను ఆపేస్తాను’ అని ఓ ఎపిసోడ్ లో అన్నాడు కూడా. అంత కామన్ సెన్స్ తో, ఎఫెక్టివ్ గా చెప్పాడు కాబట్టే పూరి మ్యూజింగ్స్ రికార్డులు క్రియేట్ చేశాయి. డైరక్ట్ గా బుర్రకు ఎక్కే తన మాటల కోసం, కొత్త విషయాల కోసం ప్రతిరోజూ ఎదురుచూసేలా చేసాడు.. ఈ డాషింగ్ డైరక్టర్.


Recent Random Post: