డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా గత ఏడాది విడుదలకు సిద్దం అవుతున్న సమయంలో కరోనా కారణంగా వాయిదా పడింది. గత ఏడాది చివర్లోనే థియేటర్లు పునః ప్రారంభం అయినా కూడా ఇప్పటి వరకు విడుదలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వక పోవడంతో రకరకాలుగా ప్రచారం జరిగింది. ఈ సినిమా థియేటర్ రిలీజ్‌కు అవకాశం లేదేమో అంటూ పుకార్లు షికార్లు చేశాయి. చివరకు ఈ సినిమా ను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
అనీల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆకాష్ కు జోడీగా కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ను పూరి మరియు ఛార్మిలు కలిసి నిర్మించారు. ఈ సినిమా ను జూన్ 18న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో ఆకాష్ మరియు కేతికల మద్య రొమాంటిక్ సీన్స్ మరో లెవల్ లో ఉంటాయంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
???? ???? ????,
Theatres Will Get #Romantic with @ActorAkashPuri & #Ketikasharma's Exotic Fascination ?
@meramyakrishnan ‘s power packed performanceProduced by #PuriJagannadh @Charmmeofficial ♥️
Directed by @anilpaduri @PuriConnects #PCfilm ? #RomanticJUNE18 pic.twitter.com/W95uWprpou— Puri Connects (@PuriConnects) March 1, 2021
Recent Random Post: