‘పుష్ప’ ఊరన్నర మాస్ గురూ

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంను బన్నీ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తుండగా.. ఖచ్చితంగా ఒక మంచి సినిమాగా పుష్ప నిలుస్తుందని మీడియా వర్గాల వారు కూడా నమ్మకంగా చెబుతున్నారు. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. పుష్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు మరీ ఊరమాస్ గా ఉంటాయని అంటున్నారు.

సుకుమార్ గత సినిమా రంగస్థలంలో హీరో రామ్ చరణ్ ను పల్లెటూరు చెవిటి కుర్రాడిగా చూపించాడు. అలాంటి పాత్రలు.. అలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసేందుకు కొందరు స్టార్ హీరోలు సిద్దం అవ్వరు. కాని సుకుమార్ ను నమ్మిన రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రను చేసినందుకు గాను రంగస్థలం అద్బుతమైన హిట్ ను దక్కించుకుంది. అందుకే ఇప్పుడు రంగస్థలం చిట్టిబాబును మించి పుష్పరాజ్ పాత్ర మాస్ గా ఉంటుందట. తెలుగు సినిమాల్లో ఈమద్య కాలంలో మరీ ఇంత ఊర మాస్ హీరో పాత్ర చూసి ఉండరని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

రంగస్థలం సినిమాలో చిట్టిబాబును సుకుమార్ ఊరమాస్ గా చూపిస్తే.. పుష్ప రాజ్ పాత్రను ఊరన్నర మాస్ గా చూపించేందుకు స్క్రిప్ట్ రెడీ చేశాడట. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. బన్నీ ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా కాస్త మాస్ హీరోగా కనిపించాడు కాని మరీ ఊరన్నర మాస్ పాత్రలో ఎలా ఉంటాడో చూడాలి. ఇప్పటికే ఆయన లుక్ చూస్తే ఎంత మాస్ గా కనిపించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. సినిమా చూస్తే ఆ విషయము మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.


Recent Random Post: