రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. రాధే శ్యామ్ ను జులై 30న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం రాధే శ్యామ్ నిర్మాణాంతర కార్యక్రమాలు ముంబైలో కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం కోవిద్ సెకండ్ వేవ్ వల్ల మహారాష్ట్రలో భారీ ఎత్తున కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ కూడా విధించారు.
ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ నిర్మాణాంతర కార్యక్రమాలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ అనేది చాలా ముఖ్యం. ఇంకా చాలా విఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పనులను ముంబై నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ చేద్దామా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా మరికొంత ఆలస్యమైనా కూడా రాధే శ్యామ్ విడుదలలో మరోసారి మార్పు రావడం ఖాయం.
Recent Random Post: