రాధేశ్యామ్ యూఎస్ పరిస్థితి ఇది!

ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సినిమా అవ్వడం తో ఖచ్చితంగా ఆకాశమే హద్దు అన్నట్లుగా వసూళ్లు నమోదు అవుతాయని ట్రేడ్ వర్గాల వారు కూడా భావించారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా భారీ గా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

బాహుబలి సినిమాల ప్రభావంతో ప్రభాస్ సినిమా అంటే యూఎస్ లో ముక్కు.. చెవులు అన్ని కోసుకుంటూ అభిమానులు ఎదురు చూశారు. అందుకే భారీగా అక్కడి డిస్ట్రిబ్యూటర్ సినిమాను విడుదలకు ప్లాన్ చేశాడు.

అందుకోసం భారీ మొత్తంను పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. సినిమా కు వచ్చిన బజ్ నేపథ్యంలో ప్రీమియర్ షో ల ద్వారానే భారీ మొత్తంను రాబట్టింది. కాని సినిమాకు వచ్చిన టాక్ కారణంగా లాంగ్ రన్ లో ఆ స్థాయి వసూళ్లు దక్కించుకోలేక పోయింది.

యూఎస్ లో ఈ సినిమా అయిదు మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు అవుతాయనే ఒక టాక్ వినిపించింది. కాని అనూహ్యంగా సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం తో అనూహ్యంగా వసూళ్లు దారుణంగా ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది. ఈ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా వసూళ్ల పరిస్థితి అలాగే ఉంది. విడుదల అయిన దేశాలు అన్నింటిలో కూడా రాధేశ్యామ్ టార్గెట్ ను రీచ్ కాలేక పోయింది.

అమెరికాలో రాధేశ్యామ్ రన్ క్లోజ్ అయ్యింది. దాదాపుగా అన్ని చోట్ల కూడా సినిమా కనిపించకుండా పోయింది. ఫైనల్ రన్ పూర్తి అయ్యే టైమ్ కు రాధేశ్యామ్ సినిమా యూఎస్ లో దాదాపుగా 2 మిలియన్ డాలర్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ నెంబర్ ఆశించిన దానికి చాలా తక్కువ అంటూ స్వయంగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే యూఎస్ లో బిజినెస్ ఎంత జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది.

అక్కడ విడుదల విషయంలో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసి భారీ ఓపెనింగ్స్ ను రాబట్టడం ద్వారా యూఎస్ బయ్యర్ కొద్ది లో కొద్దిగా అయినా సేఫ్ అయినట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ప్రభాస్ సినిమాకు బయ్యర్ పెట్టిన మొత్తంకు వచ్చిన కలెక్షన్స్ కు పొంతన లేకుండా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి యూఎస్ లో రాధేశ్యామ్ రన్ కంప్లీట్ అవ్వడంతో అంతా కూడా ఆర్ ఆర్ ఆర్ సందడి కోసం వెయిట్ చేస్తున్నారు.


Recent Random Post: