ఈ మధ్య కాలంలో అతి పెద్ద డిజాస్టర్లలో రాధే శ్యామ్ కూడా ఒకటి. ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. జరిగిన బిజినెస్ లో కనీసం సగం కూడా వసూలు చేయలేకపోయింది. మొదటి వీకెండ్ తర్వాత రాధే శ్యామ్ పూర్తిగా చతికిలపడింది. దీనికి తోడు హిందీలో కాశ్మీర్ ఫైల్స్ ప్రభంజనం సృష్టించడంతో రాధే శ్యామ్ కోలుకోలేకపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా రాధే శ్యామ్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. దీంతో ఈ చిత్రాన్ని నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పంపిణీ చేసిన దిల్ రాజుకు భారీ నష్టాలు వాటిల్లాయి. మొత్తంగా 20 కోట్ల రూపాయల మేరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.
మరి ఇంత నష్టంలో సగమైనా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తిరిగి ఇస్తుందా? లేక దిల్ రాజు – ప్రభాస్ తో తీయబోయే సినిమాకు చూసుకుంటారా అన్నది చూడాలి.
Recent Random Post: