తనపై వైసీపీ ఎంపీలు అనర్హత వేటు వేయించలేకపోతే తానే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని రఘురామ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. తనపై అనర్హత వేటుకు వైకాపా నేతలకు ఈ నెల 11 వరకు సమయమిచ్చినట్టు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు.
తాను ఫిబ్రవరి 5నే రాజీనామా చేస్తానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై మరోసారి విరుచుకుపడ్డారు. “రాజీనామా విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా. ‘ఇక నా వల్ల కాదు.. నువ్వే రాజీనామా చెయ్యు’ అని సీఎం జగన్ అంటే అప్పుడు చేస్తా. రాజీనామా విషయంలో నేను స్పష్టతతోనే ఉన్నాను’’ అని అన్నారు.
మరోవైపు.. రఘురామపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. గతంలోనే ఆయనపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే రిఫరెండంతో తాను తన పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని రఘురామ స్పష్టం చేశారు.
Recent Random Post: