దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. గత రెండేళ్ల నుండి షూటింగ్ సాగుతూనే ఉంది. ఆర్ ఆర్ ఆర్ ను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు కానీ అది సాధ్యమవ్వదని తేలిపోయింది.
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ ఇలా అన్నీ కలుపుకుని జక్కన్నకు ఆరేడు నెలల సమయం పడుతుందిట. ఈ నేపథ్యంలో జూన్ లేదా జులైలో తిరిగి షూటింగ్స్ మొదలైనా డిసెంబర్ కు చిత్రాన్ని సిద్ధం చేయడం కష్టమే.
దీంతో రాజమౌళి రిలీజ్ డేట్ పై ఒక నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ ను ఏప్రిల్ 28, 2022న విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఈ విషయం రామ్ చరణ్, ఎన్టీఆర్, నిర్మాతలకు కూడా చెప్పినట్లు సమాచారం.
Recent Random Post: