హాలీవుడ్ ప్రమాణాలతో సినిమాలు తీయగల దిగ్గజ దర్శకులు భారతదేశంలో ఎందరో ఉన్నారు. కానీ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిలా యూనిక్ కంటెంట్ ఎక్స్ క్లూజివ్ విజువల్స్ తో భారీతనంతో అసాధారణ సినిమాలు తీసే వేరొక దర్శకుడు ఉన్నాడా? అన్నదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్.
నిన్నటిరోజున రిలీజైన ఆర్.ఆర్.ఆర్ టీజర్ గ్లిమ్స్ వీక్షించాక అప్పటివరకూ రాజమౌళిపైనా ఏదో మూల దాగి ఉన్న సందేహాలు కూడా తొలగిపోయాయి. ఆయన తెరకెక్కించిన బాహుబలి అప్పట్లో ఫ్లూక్ లో వెళ్లిందని హిందీ బెల్టులో సర్ధి చెప్పుకున్నారు. రాజమౌళిలా మేం కూడా తీసేస్తాం అంటూ తమిళం హిందీ సహా దేశవ్యాప్తంగా ఉన్న చాలా సినీపరిశ్రమల్లో ప్రయత్నాలు సాగాయి. కానీ ఏవీ సఫలం కాలేదు. పాన్ ఇండియా కేటగిరీలో ఇప్పటివరకూ బాహుబలి ఫ్రాంఛైజీ రికార్డులను కొట్టిన సినిమానే లేదు. అమీర్ ఖాన్ దంగల్ ని మించి ఇండియాలో వసూళ్ల రికార్డుల్ని సాధించిన చిత్రంగా బాహుబలి 2 నిలిచింది. ఇదంతా జక్కన్న క్రెడిట్. అతడి అసాధారణ పనితనాన్ని ప్రతిభను ఎలివేట్ చేసిన ఘట్టం. అప్పటి నుంచి హిందీ లో ప్రముఖ దర్శకులు రాజమౌళిని కొట్టేలా మరో సినిమా తీయాలని శ్రమిస్తూనే ఉన్నారు. కానీ ఏదీ ఫలించడం లేదు. బాహుబలి రేంజు కలెక్షన్ల సునామీ అయితే లేదు.
ఇప్పుడు బాహుబలిని కొట్టేలా దేశ చరిత్రకే తలమానికం అనిపించేలా ఆర్.ఆర్.ఆర్ సినిమాని రాజమౌళి తెరకెక్కించారని అర్థమవుతోంది. ఈ టీజర్ విడుదల కాగానే జనాలకు రాజమౌళి పనితనమే స్ఫురిస్తోంది తప్ప వేరొక ఆలోచన ఏదీ లేనే లేదు. ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడు ఎవరు? అంటే.. కచ్ఛితంగా ఎస్.ఎస్.రాజమౌళి అని ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ముందే చెప్పేస్తున్నారు. ఇతర దర్శకుల్ని డిఫెన్స్ లో పడిపోయే విజువల్ గ్రాండియర్ సినిమాల్ని తెరకెక్కించి భారతీయ చలన చిత్ర పరిశ్రమను హాలీవుడ్ రేంజులో నిలబెట్టే సత్తా ఉన్న టాప్ డైరెక్టర్ గా రాజమౌళి పేరు సువర్ణాక్షరాలతో లిఖితం కానుందని తాజా సన్నివేశం చెబుతోంది.
ఆసక్తికరంగా బాహుబలితో పాన్ ఇండియా స్టార్ ని చేసిన ప్రభాస్ సైతం ఇప్పుడు ఖాన్ లను మించిపోతుంటే ఇదే సమయంలో రాజమౌళి కూడా తన స్టామినాని పదింతలు పెంచుకోవడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. దేశంలో నం.1 హీరో ప్రభాస్.. నం.1 డైరెక్టర్ రాజమౌళి! అని ప్రకటించడానికి ఇంకెంతో సమయం పట్టదని ఆ ఇరువురి ప్రణాళికలు చెబుతున్నాయి. రాజమౌళి తదుపరి మహేష్ తో తెరకెక్కించబోయేది ఇంతకుమించిన అసాధారణ చిత్రమని ముందే సంకేతం అందింది. రాజమౌళిని ఇండియన్ కామెరూన్ అని అంగీకరించే సమయం దగ్గర పడింది. అతడు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో ఆ స్థాయిని అందుకునేందుకు దగ్గరగా ఉన్నాడు.
ఇదంతా చూస్తుంటే ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు రాజమౌళిని ఢీకొట్టేందుకు తనదైన అస్త్రాలను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు భారీతనం నిండిన సినిమాలు అంటే శంకర్ పేరే వినిపించేది. ఇప్పుడు రాజమౌళి రేసులో దూసుకెళుతున్నాడు. ఇతరుల్ని వెనక్కి నెట్టేస్తున్నాడు. గతంలో సౌత్ సినిమా అంటే.. శంకర్ – రాజమౌళి పేర్లను మాత్రమే గొప్పగా హిందీ బెల్టులో చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యనా గొప్ప పోటీ వాతావరణం నెలకొంది. ఇక శంకర్ ఇప్పటి సన్నివేశంలో చరణ్ తో తీస్తున్న సినిమాని మరో లెవల్లో ఆవిష్కరించాల్సి ఉంటుందని సంకేతం అందింది.
Recent Random Post: