బాలకృష్ణతో సినిమాపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

రాజమౌళి.. `బాహుబలి` తరువాత ఈ దర్శకుడితో సినిమా చేయాలనుకోని హీరో లేడంటే అది అతిశయోక్తి కాదేమో. అంతలా ఆయనతో కలిసి కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని దేశ వ్యాప్తంగా వున్న ఇండస్ట్రీలకు సంబంధించిన స్టార్ హీరోల నుంచి నేటి తరం యంగ్ హీరోలు వరకు భాష తో సంబంధం లేకుండా ప్రధాన భాషలకు చెందిన వారు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రతీ వేదికపై తమ కోరికని బయటపెడుతున్నారు. తాజాగా ఇలాంటి దృశ్యమే ఆహా ఓటీటీ లో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ లో చోటు చేసుకుంది. ఈ షోకు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ షోలో దర్శకధీరుడు రాజమౌళి ఎం.ఎం. కీరవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సినిమా తీసేటప్పుడు తాను హీరో కష్ట సుఖాలను పెద్దగా పట్టించుకోనని ఒక వేళ బాలకృష్ణతో సినిమా చేస్తుంటే తన వ్యవహార శైలి ఆయనకు నచ్చక..ఆయనకు ఆగ్రహాన్ని తెప్పిస్తుందేమోనని భయం వుండేదని ఆ కారణంగానే ఆయనతో సినిమా చేయడానికి తాను సాహసించ లేదని రాజమౌళి చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ షోలో పాల్గొన్న రాజమౌళిని `ఇప్పటి వరకు మన కాంబినేషన్ పడలేదని నా అభిమానులు బాలయ్యతో సినిమా ఎప్పుడు అని అడిగితే మీరు బాలకృష్ణను నేను హ్యాండిల్ చేయలేనని అన్నారట ఎందుకని బాలయ్య అడిగితే పై విధంగా స్పందించి షాకిచ్చారు.

ఆ సమాధానం విన్న బాలయ్య `అలా ఎందుకు చెప్పారని తిరిగి ప్రశ్నిస్తే `భయంతోనే అలా చెప్పానని రాజమౌళి సమాధానం చెప్పడం నవ్వులు పూయిస్తోంది. అంతే కాకుండా చిన్నవాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికి మీరు సమానమైన గౌరవం ఇస్తారని చాలా పద్దతిగా వుంటారు. నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎలా వుంటానో నాకు తెలియదు. నాకు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెబితే చిరాకు. షాట్ పెట్టెకుని పక్కన హీరో ఎండలో నిలబడ్డాడా? .. వానలో నిలబడ్డాడా? అన్నది చూడను. నా ఫ్రేమ్ రెడీ అయ్యే వరకు హీరో కష్ట సుఖాలు పట్టించుకోను. ఒక వేళ మిమ్మల్ని డైరెక్ట్ చేయాల్సి వస్తే నా వ్యవహారశైలి మీకు కోపం తెప్పిస్తుందేమోనని భయం.. టెన్షన్. `అని రాజమౌళి సమాధానం చెప్పారు. అయితే వెంటనే బాలకృష్ణ `నేను ఒకసారి క్యారవాన్ లో నుంచి బయటకి దిగితే ఆ రోజు షూటింగ్ అయ్యే వరకు లోపలికి వెల్లను గొడుగు పట్టనివ్వనన్నారు.

ఇదే సందర్భంగా రాజమౌళిపై `మీరు సినిమా చేయడానికి మూడేళ్లు ఎందుకు పడుతోంది? అని మరో ప్రశ్నని సంధించారు బాలయ్య. నేను రోజూ నా మైండ్ లో అనుకున్న విధంగా సినిమా వస్తోందా? లేదా అని భయపడుతుంటా..అందుకే ఒకటికి రెండు సార్లు ప్రతీదీ చెక్ చేసుకుంటా. ఎందుకంటే సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడికి పూర్తి వినోదం అందించాలి కదా` అని సమాధానం చెప్పారు జక్కన్న. `స్టూడెంట్ నెం.1` కంటే ముందు నన్ను కలిశారా? నాకు కథ చెప్పారనుకుంటా. అదే రామ్ చరణ్ తో తీశారా? అని బాలయ్య అడగ్గా. `నాన్నగారి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నప్పుడు రెండు మూడు సార్లు కలిశా. ఆ తరువాత `ఛత్రపతి` సమయంలో `మగధీర` కథ చెప్పాను` అన్నారు రాజమౌళి.

ఈ సందర్భంగా రాజమౌళిని కవ్వించి ఆడుకునే ప్రయత్నం కూడా చేశారు బాలయ్య. `మీ తో సినిమా చేస్తే హీరోకు ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు.. కానీ ఆ హీరో తర్వాత రెండు.. మూడు సినిమాలు ఫసక్ అట కదా.. అంటూ రాజమౌళిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు బాలయ్య.. అయితే రాజమౌళి లైట్ గా తీసుకుని నాకు ఎటువంటి సంబంధం లేదని నా సినిమా వరకు నేను బాధ్యతగా వుంటానని నవ్వేసిన రాజమౌళి చిన్నతనం నుంచి తనకు ఎప్పటికైనా `బెన్ హర్` తరహా చిత్రాలని చేయాలనే ఆలోచన వుండేదని తన మనసులో మాటని బయటపెట్టారు.


Recent Random Post: