‘మహా భారతం’ అంతా ఊహిస్తున్నట్టుగా వుండదట

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీయస్ ఫిల్మ్ `RRR`. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలసి నటించిన మెగా మల్టీస్టారర్ ఇది. ఈ మూవీ వచ్చే నెల 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియాకు దర్శకుడు రాజమౌళి హీరోలు ఎన్టీఆర్ రామ్చరణ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

తన డ్రీమ్ ప్రాజెక్ట్ `మహాభారతం` అని చాలా సందర్భాల్లో దర్శకుడు రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అది మాత్రం ఇప్పట్లో జరిగే పని కాదని కూడా చెబుతూ వస్తున్నారు. తాజాగా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ సినిమా తీస్తే అంతులో రామ్చరణ్ ఎన్టీఆర్ లని కూడా భాగస్వాములని చేస్తే వారి పాత్రలు ఎలా వుంటయని ఈ సందర్భంగా అడిగితే.. క్యారెక్టర్స్ గురించి తరువాత ఆలోచిస్తాను. అంతే కాకుండా నేను తీయబోయే మహాభారతంలోని పాత్రలు మీరు చూసిన చదివిన తరహాలో వుండవు.

చాలా కొత్తగా వుంటాయి. ఆ పాత్రల్ని నా పంథాలో ఆవిష్కరించాలనుకుంటున్నాను. మహా భారతం వుంటుంది కానీ పాత్రల మధ్య వుండే బంధాలు ఎమోషన్స్ చాలా కొత్తగా వుంటాయి` అని రాజమౌళి ఈ సందర్భంగా తెల్లడించడం ఆసక్తికరంగా మారింది. నేను రూపొందించబోయే `మహా భారతం`లో ఏ ఏ పాత్రల్లో ఎవరెవరు నటిస్తారన్నది ప్రేక్షకులు ఇప్పటికే ఊహించేసుకుంటున్నారు. కానీ స్క్రిప్ట్ పూర్తి చేసిన తరువాతే పాత్రల గురించి ఆలోచిస్తానని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.

`మహా భారతం` తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి ప్రకటించిన దగ్గరి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే ఇదే ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందన్నది ఎవరికీ తెలియదు. రాజమౌళి కూడా దీన్ని ఎప్పడికి తెరపైకి తీసుకురాబోతున్నాననే విషయాన్ని క్లారిటీగా చెప్పలేకపోతున్నాడు. కానీ పాత్రల పరంగా మహా భారతం మాత్రం అంతా ఊహిస్తున్నట్టుగా కాకుండా కొత్తగా వుంటుందని మాత్రం చెప్పడం గమనార్హం.


Recent Random Post: