రజినీ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిది

Share

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆయన గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన రాజకీయాల్లోకి రాకముందే రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించాడు. అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాల్లోకి రావడం లేదు అంటూ రజినీకాంత్‌ ప్రకటించాడు. దాంతో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. కొందరు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తే మరి కొందరు ఆయన్ను వ్యతిరేకించారు.

తాజాగా మోహన్‌ బాబు స్పందించాడు. రజినీకాంత్‌ నిర్ణయం ఆయన అభిమానులకు నిరాశ కలిగించి ఉండవచ్చు. కాని ఆయన నిర్ణయంను నేను స్వాగతిస్తున్నాను. ఒక స్నేహితుడిగా రజినీకాంత్‌ ఆరోగ్యం కోరుకునే వ్యక్తిని నేను ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలి. రాజకీయాల్లోకి వెళ్తే మంచి వాళ్లు చెడ్డ వాళ్లు అవుతారు. సీట్లు కొనడం అమ్మడం వంటివి మనలాంటి వాళ్లకు తెలియదు. నువ్వు నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. రాజకీయం అనేది రొంపి నువ్వు రాకపోవడమే మంచిది అంటూ మోహన్‌ బాబు సోషల్‌ మీడియాలో రజినీకాంత్‌ నిర్ణయాన్ని సమర్థించాడు.


Recent Random Post: