రజినీ నెక్స్ట్.. ఆ ముగ్గురిలో ఎవరితో?

రజినీకాంత్ అంటేనే స్టైల్. ఆయన పేరు తలచుకోగానే ముందుగా గుర్తొచ్చేది హుందాయైన నడక. ఆ తర్వాత తనదైన నవ్వు. తల ఎగరేయడం.. సిగరెట్ నోట్లో పెట్టుకోవడం.. సర్రున తిరిగి చూడటం.. కళ్లజోడు పెట్టుకోవడం.. ఆయన ఏం చేసినా స్టైల్గానే ఉంటుంది. ఈ స్టైలే ఒకప్పుడు రజినీకి ప్లస్. కానీ ఇప్పుడది ఆయన కెరీర్కి మైనస్ అవుతోంది.

కొంతకాలంగా రజినీతో సినిమాలు తీసే డైరెక్టర్స్ అందరూ ఆయన స్టైల్పైన మేనరిజమ్స్పైన మాత్రమే దృష్టి పెడుతున్నారు. ఆయన్ని ఎంత బాగా చూపిద్దామా ఎంత గొప్పగా ఎలివేట్ చేద్దామా అనే తపనే తప్ప.. సూపర్ స్టార్ దొరికాడు ఆయనతో ఎంత మంచి సినిమా తీద్దామా అనే ధ్యాస వారిలో కనిపించడం లేదు. దీనివల్ల వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి రజినీని. రీసెంట్గా వచ్చిన ‘అన్నాత్తే’ కూడా భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టింది కానీ టాక్ పరంగా చాలా పూర్ అనిపించుకుంది. రజినీలాంటి యూనివర్శల్ సూపర్స్టార్కి అదో పెద్ద హిట్టే కాదసలు.

ఈ దెబ్బతో రజినీ కాస్త రూటు మారుద్దామా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ముందు ముగ్గురు దర్శకులు కథలు పట్టుకుని రెడీగా ఉన్నారు. వారిలో ఒకరు ‘అన్నాత్తే’ డైరెక్టర్ శివ. రెండోది రజినీతో ‘పేట’ తీసిన కార్తీక్ సుబ్బరాజ్. మూడో దర్శకుడు ఆర్.బాల్కి. ఈ ముగ్గురూ రజినీకి ఇటీవల స్టోరీస్ నేరేట్ చేశారట. వీరిలో ఎవరో ఒకరితో రజినీ నెక్స్ట్ సినిమా చేయబోతున్నారంటూ కోలీవుడ్ నుంచి వార్తలు అందుతున్నాయి.

శివ మాస్ మసాలా ఎంటర్టైనర్స్ తీయడంలో దిట్ట. అందుకే అన్నాత్తే లాంటి ఫ్యామిలీ కాన్సెప్ట్లో కూడా వీర లెవెల్లో యాక్షన్ సీన్లు గుప్పించాడు. ఇక కార్తీక్ సుబ్బరాజు కూడా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తీస్తాడు. ఇక మిగిలింది బాల్కి. అతని రూటే వేరు. చీనీ కమ్ పా ప్యాడ్మేన్ లాంటి డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తాడు. రజినీ కోసం కూడా ఓ సీరియస్ కాన్సెప్ట్నే తీసుకొచ్చాడని సమాచారం. యాక్షన్కి తావు లేకుండా కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్గా ఉండే సబ్జెక్ట్ అట.

రజినీ కనుక రూటు మార్చాలి అనుకుంటే బాల్కితో వర్క్ చేయడానికే ప్రయత్నించాలి. ఎందుకంటే మొదటి ఇద్దరూ కూడా రజినీకి ఎంత ఎలివేట్ చేయాలో అంత చేసేశారు. మళ్లీ వాళ్లతో పని చేస్తే రొటీన్ అయ్యే ప్రమాదం ఉంది. అలా అని బాల్కితో కూడా రిస్క్ లేకపోలేదు. రజినీ నుంచి కోరుకునే ఎంటర్టైన్మెంట్కి బాల్కి మేకింగ్ స్లైల్కి సింక్ కాకపోవచ్చు. అదే జరిగితే రజినీ ఫ్యాన్స్ కచ్చితంగా డిజప్పాయింట్ అవుతారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ ఎక్స్ట్రార్డినరీ సబ్జెక్ట్ని రజినీకి తగ్గట్టు మార్చి ఎంటర్టైన్ చేయగలిగే దర్శకుడు కావాలి. అలాంటివాడి కోసం రజినీ వెతుకుతారా లేక ఈ ముగ్గురిలో ఒకరితో కమిటవుతారా అనేది చూడాలి.


Recent Random Post: