మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో క్రాక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పటికే ఖిలాడీ సినిమాను ముగింపు దశకు తీసుకు వచ్చాడు. ఈ కరోనా సెకండ్ వేవ్ వచ్చి ఉండకుంటే ఇప్పటికే ఖిలాడీకి గుమ్మడి కాయ కొట్టి కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో సినిమా ను పట్టాలెక్కించే వారు. ఖిలాడీ సినిమా షూటింగ్ ను వచ్చే నెలలో పూర్తి చేసి అదే సమయంలో శరత్ దర్శకత్వంలో సినిమాను కూడా మొదలు పెట్టేలా రవితేజ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ.. శరత్ మండవల కాంబో మూవీకి హీరోయిన్ గా మలయాళి ముద్దుగుమ్మ రజిష విజయన్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.
మలయాళంలో పలు సినిమాలతో సక్సెస్ లను దక్కించుకున్న రజిష విజయన్ తమిళంలో సూపర్ హిట్ మూవీ కర్ణన్ తో ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ హీరోగా రూపొందిన కర్ణన్ సినిమా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలాంటి సినిమాలో కీలక పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ముద్దుగుమ్మ రజిషను రవితేజ కోసం సంప్రదించారు. టాలీవుడ్ మార్కెట్ నేపథ్యంలో ఆమె కాదనకుండా వెంటనే రవితేజ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రజిషకు తెలుగులో మంచి భవిష్యత్తు ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.
రవితేజ మాస్ ఇమేజ్ కు రజిష లాంటి హీరోయిన్ జోడీ కుదిరితే తప్పకుండా సక్సెస్ ఖాయం అనే నమ్మకంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రవితేజ తో శరత్ రూపొందించబోతున్న సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని.. కథ చాలా నచ్చడంతో మరో రెండు సినిమాలు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి రవితేజ ఈ సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. అంటే కథ ఏ రేంజ్ లో ఆయన్ను ఇన్సిపైర్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. క్రాక్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజకు ఖిలాడీ మరియు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. కనుక ఈ సినిమా ల విషయంలో ఆయన ఎక్కువ శ్రద్ద పెట్టాడు.
Recent Random Post: