ప్రస్తుతం దేశంలో కరోనా ఉన్నట్లు అనిపించట్లేదు. అందరూ తమ తమ పనుల్లో పాత జీవితాల్లోకి వెళ్లిపోయారు కానీ కరోనా కూడా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ సోకిన విషయం తెల్సిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ లిస్ట్ లో చేరింది.
ఆమెకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా వెల్లడించింది. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. ఆరోగ్యంగానే ఉన్నా అంటూ రకుల్ ప్రీత్ తెలిపింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్లు, పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. తనతో రీసెంట్ గా కాంటాక్ట్ ఉన్నవాళ్లు తక్షణమే టెస్ట్ చేయించుకోవాలని అంటోంది రకుల్ ప్రీత్.
ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ ఆమె ట్వీట్ కు రిప్లై ఇస్తున్నారు. రీసెంట్ గా సమంత నిర్వహిస్తోన్న సామ్ జామ్ షో లో పాల్గొంది రకుల్ ప్రీత్. తెలుగులో రెండు, హిందీలో ఒక సినిమాతో బిజీగా ఉంది.
??? pic.twitter.com/DNqEiF8gLO
— Rakul Singh (@Rakulpreet) December 22, 2020
Recent Random Post: