కొన్ని దృశ్యాలు అరుదుగానే గోచరిస్తాయి. అలాంటి అరుదైన దృశ్యమే ఇది. ఒకే ఫోటో ఫ్రేమ్ లో ఉపాసన-నమ్రత-శ్రీజ కనిపించారు. వీరితో పాటు బంధుమిత్రులు కూడా.. ప్రస్తుతం ఈ రేర్ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇంతకీ అకేషన్ ఏమిటో..!
టాలీవుడ్ సెలబ్రిటీల గెట్ టు గెదర్ పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అరుదుగా స్టార్ హీరోల సతీమణులంతా ఒకేచోట కలుసుకుని గ్రాండ్ గా పార్టీలతో చిల్ అవుతుంటారు. ఇక అకేషనల్ గా కలిసారంటే ఆ ఎంజాయ్ మెంట్ వేరుగా ఉంటుందిగా. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన .. సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్.. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజకళ్యాణ్ ఒకే ఫోటో ఫ్రేమ్ లో కనిపించారు. వీరితో పాటు దియా భూపాల్ – స్మిత- ఉపాసన చెల్లెలు అనుష్పాల కామినేని- మేఘన గోరుకంటి అంతా ఒకే చోట కలిసి పార్టీ మోడ్ లోకి వెళ్లిపోయారు.
అందరూ కలిసి ఓ సెల్ఫీ దిగి ఇలా ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఉపాసన వైట్ తెలుపు వర్ణం గౌనులో తళుక్కున మెరిసారు. నమ్రతా ఆరేంజ్ రంగు ఫ్యాంట్..షర్టు లో కనిపించారు. మరి ఈ పార్టీ దేనికంటే? ఉపాసన చెల్లెలు అనుష్పాల కామినేని త్వరలో పెళ్లి కూతురు అవుతున్నందుకేనని తెలుస్తోంది.
అనుష్పాల- అథ్లెట్ ఆర్మాన్ ఇబ్రహింతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య నిశ్చితార్ధ కార్యక్రమం కూడా పూర్తి చేసారు. అనుష్పాలా తన ప్రేమికుడితో కలిసి ఉన్న ఫోటోలు ఇంతకుముందు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఈ సందర్భంగానే టాలీవుడ్ కి చెందిన ప్రముఖులంతా ఇలా ఓచోట కలిసి ఫోటోగ్రాఫ్ లతో సందడి చేశారని తెలుస్తోంది. చెల్లెలు పెళ్లి బాధ్యతల్ని అక్క ఉపాసనే దగ్గరుండి చూస్తుందిట. అందుకు హబ్బీ మిస్టర్- సి సహకారం ఎలానూ ఉంటుందనుకోండి!
Recent Random Post: