దక్షిణాది చిత్రపరిశ్రమలో కుర్రకారుకు మోస్ట్ ఫేవరేట్ హీరోయిన్స్ లో ఒకరు రాశిఖన్నా. దేశంలో ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి అమ్మడు ముఖానికి మాస్క్ లేకుండా కనిపించడం లేదు. కానీ ఫేవరేట్ హీరోయిన్ ఎంత దాచుకున్నా ఫ్యాన్స్ గుర్తుపట్టకుండా ఉంటారా.. రాశి ఎక్కడ కనిపించినా ఇట్టే గుర్తుపట్టి హల్చల్ చేస్తుంటారు. ఈ మధ్యన రాశి కేవలం సోషల్ మీడియాలోనే టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తుంది. ఎప్పుడైతే వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాప్ అయిందో.. అప్పటినుండి రాశి తెలుగులో మళ్లీ సినిమాలు చేయలేదు. అలాగే సంవత్సరం పాటు ఏ తెలుగు సినిమా కూడా ప్రకటించలేదు. పరిస్థితి చూస్తుంటే తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లుందని అందరూ అనుకున్నారు.
అదే కాకుండా ఇప్పటికి రాశి చేతినిండా తమిళ సినిమాలే ఉన్నాయి. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ సోయగం.. ప్రస్తుతం సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తోంది. ఇటు తెలుగు తమిళంతో పాటు మలయాళం హిందీ సినిమాలను కూడా ఈ లాక్డౌన్ లో లైనప్ చేసేసింది. అయితే ఇన్నేళ్లుగా తెలుగులో సినిమాలు చేస్తోంది కానీ అమ్మడు ఇంతవరకు స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఇప్పటికి తనకంటూ స్టార్డం తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ‘ఇమైకనొడిగళ్’ అనే మూవీతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది రాశి. ఆ మూవీ మంచి విజయం సాధించి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం రాశి చేతిలో అరణ్మనై-3 – మేధావి – తుగ్లక్ దర్బార్ – సర్దార్ – సైతాన్ క బచ్చా ఇలా వరుసగా తమిళ సినిమాలు ఉన్నాయి. అయితే అటు గ్లామర్ – ఇటు ట్రెడిషనల్ ఎలాంటి రోల్ అయినా చేసేందుకు సిద్ధమే అంటోంది రాశి. వీటితో పాటు తెలుగులో నాగచైతన్య సరసన థాంక్యూ – గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తోంది. మరి ఆల్రెడీ బాలీవుడ్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది కాబట్టి త్వరలోనే షాహిద్ కపూర్ తో ఓ సినిమా చేయనుంది. ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. దర్శకులు రాజ్ అండ్ డీకే.. వీరిద్దరినీ డిజిటల్ తెరకు పరిచయం చేస్తున్నారు. వీటితో పాటు రాశి త్వరలోనే మలయాళంలో డెబ్యూ చేయబోతుంది. అదికూడా బాలీవుడ్ సూపర్ హిట్ అందధున్ మూవీ రీమేక్ తో అమ్మడు డెబ్యూకు సిద్ధం అవుతోంది. మరి చూస్తుంటే త్వరలో రాశి సౌత్ టు నార్త్ అన్ని ఇండస్ట్రీలలో పాగా వేసేలా ఉందని టాక్ నడుస్తుంది. చూడాలి మరి నిజంగానే అన్ని ఇండస్ట్రీలలో స్టార్డం అందుకుంటుందేమో!
Recent Random Post: