రాశీఖన్నాకు మరో `ఫ్యామిలీ మ్యాన్` తగిలిందా?

వెబ్ సిరీస్ లు ఇప్పుడు నయా ట్రెండ్. సరైన కంటెంట్ ఉంటే ఓటీటీ వేదికలపై ఆదరణకు కొదవేమీ లేదని ప్రూవైంది. అసలు స్టార్ పవర్ తో సంబంధం లేకుండా చాలా వెబ్ సిరీస్ లు యువతరంలో ఆదరణ దక్కించుకుంటున్నాయి. కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తే సినిమాల్ని మించిన పారితోషికాలు అందుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నవతరం నాయికల నుంచి సీరియర్ స్టార్ల వరకూ బాలీవుడ్ లో చాలా మంది వెబ్ సిరీస్ లపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.

తాజాగా రాశీఖన్నా మనసు కూడా వెబ్ సిరీస్ ల వైపు మళ్లిందిట.. `ది ఫ్యామిలీ మ్యన్` సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే త్వరలో మరో వెబ్ సిరీస్ ని ప్రారంభిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గా రాశీఖన్నాను ఫైనల్ చేసారు. దీంతో రాశీఖన్నా పేరు ఇప్పుడు ఇంటా బయటా మార్మోగుతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కి ఓటీటీలో మంచి రేటింగ్ వచ్చింది. సీజన్ 2 తొలి భాగాన్ని మించి బంపర్ హిట్టయ్యింది.

అందులో నటించిన పాత్రధారులకు మంచి పేరు ప్రఖ్యాతులు దక్కాయి. సమంత పార్ట్ 2 లో ఎల్.టి.టి.ఇ తీవ్రవాది రాజీ పాత్రలో నటించి ప్రశంసలందుకుంది. ఈ నేపథ్యంలో తదుపరి రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ ని మించిన థ్రిల్లర్ సిరీస్ ని రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో రాశీ ఖన్నా కు ఆఫర్ రావడంతో తన ఫేట్ కూడా మారడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. కానీ అవేవీ తనకు పెద్దగా గుర్తింపును తీసుకురాలేకపోయాయి. మరి ఈసారి నటిగా మరింత స్కోప్ పెంచే ఆఫరేనా? అన్నది వేచి చూడాలి.

అలాగే రాశీఖన్నా లీడ్ రోల్ లో సురేష్ వంగ అనే దర్శకుడు మరో వెబ్ సిరీస్ చేస్తున్నారుట. దీన్ని తెలుగు ఓటీటీ కోసం చేస్తున్నారని సమాచారం. క్రైమ్ యాక్షన్ నేపథ్యంలో ఆద్యంతం రంజింప జేస్తుందని తెలిసింది. ఇందులో ఆమె ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించనుది. మరి సినిమాలు ఇవ్వలేని ఆ బ్రాండ్ ఇమేజ్ ని వెబ్ సిరీస్ లు ఇస్తాయా? అన్నది చూడాలి. అందరికీ సమంతలా జాక్ పాట్ తగలడం కూడా అరుదైన వ్యవహారమే. ప్రస్తుతం రాశీఖన్నా నాగచైతన్య సరసన `థాంక్యూ` గోపీచంద్ సరసన `పక్కా కర్శియల్` చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.


Recent Random Post: