నటి రేణు దేశాయ్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెల్సిందే. ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా తన అప్డేట్స్ ను ఇస్తున్నారు ఈమె. జానీ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన రేణు దేశాయ్ ఇటీవలే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోన్న రేణు దేశాయ్, రైతుల సమస్యల నేపథ్యంలో ఒక సినిమా చేస్తానని అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే రేణు దేశాయ్ తన స్నేహితులతో కలిసి ఇటీవలే వారణాసి ట్రిప్ కు వెళ్లారు. ఆ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో రేణు దేశాయ్ అందరికీ షాక్ ఇచ్చారనే చెప్పాలి. సన్యాసిని గెటప్ లో దర్శనమిచ్చారు ఈమె.
నుదుటిన అడ్డ నామాలు, విబూది, జుట్టు విరబోసుకుని సన్యాసిని గెటప్ లో అందరికీ షాక్ ఇచ్చారు. ఈ ఫోటోలకు మతతత్వం ఉండకూడదు, ఆధ్యాత్మికత్వం ఉండాలి. రెండిటికీ తేడా తెలుసుకోండి అని క్యాప్షన్ ను జత చేసారు.
Recent Random Post: