మరణాన్ని ఆపేసే ‘టాబ్లెట్’ కథతో వర్మ ఆసక్తికర సినిమా

రామ్ గోపాల్ వర్మ స్పార్క్ అనే కొత్త ఓటిటి ఛానల్ ను లాంచ్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో డి కంపెనీ మొదట విడుదలవుతోంది. వీటితో పాటు వర్మ ఆసక్తికరంగా అనిపించినా సినిమాలను తన ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేయనున్నాడు. అంతే కాకుండా తనను మెప్పించిన సినిమాలకు ప్రైజ్ మనీ కూడా ఇవ్వనున్నాడు.

స్పార్క్ ఓటిటి ద్వారా భిన్నమైన కంటెంట్ ను ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల కాబోతోన్న మరో సినిమా టాబ్లెట్. ప్రతీ ఒక్కరూ వృద్ధాప్యం వస్తోందంటే కచ్చితంగా మృత్యువు గురించి భయపడతారు. టాబ్లెట్ చిత్రం మృత్యువును ఆపేసే ఒక మెడిసిన్ చుట్టూ తిరుగుతుందిట. ఆ టాబ్లెట్ అందరూ వరం అనుకుంటారు కానీ అది ఎంతటి శాపమో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ.


Recent Random Post: