దుబాయ్ లో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్లేనా..?

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న టాలీవుడ్ ఫిలిం మేకర్స్.. తమ చిత్రాలను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారతీయ భాషలతో పాటుగా పలు ఫారిన్ లాంగ్వేజెస్ లలో సినిమాలను రూపొందిస్తున్నారు. ఇదే క్రమంలో వరల్డ్ వైడ్ గా మూవీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. చిత్ర బృందం అంతా యూఎస్ఏ కు వెళ్లి సినిమాని ప్రమోట్ చేయడం.. సింగపూర్ మలేషియాలలో ఈవెంట్స్ చేయడం చూశాం. అయితే ఇప్పుడు దుబాయ్ లో సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు.

ఇటీవలి కాలంలో ‘కురుప్’ వంటి కొన్ని మలయాళీ చిత్రాల ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో దుబాయ్ లో నిర్వహించారు. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ‘లడకీ’ (డ్రాగన్ గర్ల్) ప్రమోషన్స్ ను నవంబర్ 27న బుర్జ్ ఖలీఫాలో చేస్తున్న సంగతి తెలిసిందే. అలానే ‘ఆర్.ఆర్.ఆర్’ ‘పుష్ప’ వంటి పాన్ ఇండియా సినిమాలు కూడా వరల్డ్ వైడ్ అటెన్షన్ కోసం దుబాయ్ లో ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఈవెంట్స్ క్యాన్సిల్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అజయ్ దేవగన్ – అలియా భట్ వంటి స్టార్స్ అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేలా భారీ ఖర్చుతో దుబాయ్ లో RRR ఈవెంట్ ను ప్లాన్ చేశారు. అయితే కోవిడ్ కేసుల భయంతో నిర్మాతలు తమ ఎమిరేట్స్ ప్లాన్ ను ఇప్పుడు రద్దు చేసుకున్నారని నివేదికలు వెల్లడించాయి.

అదే సమయంలో RRR బాటలో నడవాలనుకున్న ‘పుష్ప’ మేకర్స్ కూడా దుబాయ్ వెళ్లే ఆలోచన విరమించుకున్నారని అంటున్నారు. ఇంకా ఓ సాంగ్ షూటింగ్ మరియు డబ్బింగ్ – విజువల్ ఎఫెక్ట్స్ సహా ఈ చిత్రానికి సంబంధించిన చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసి డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయాల్సిన ఉంది. ఇంత తక్కువ గ్యాప్ లో ఈ కార్యక్రమాలన్నీ చూసుకొని దుబాయ్ లో ఈవెంట్ ప్లాన్ చేయడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారట.

ఈ నేపథ్యంలో రెండు పాన్ ఇండియా సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ ఇండియాలోనే జరిగుతాయని అంటున్నారు. కాకపోతే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ప్రధాన నగరాల్లో మీడియాతో ముచ్చటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జనవరి 14న రిలీజ్ కానున్న ‘రాధే శ్యామ్’ సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా విదేశాల్లో చేస్తారని టాక్ వచ్చింది. ప్రభాస్ సినిమా షూటింగ్ కు సంబంధించిన వార్తలను విదేశీ మీడియా కూడా విస్తృతంగా కవర్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఎడిన్ బర్గ్ లేదా స్కాట్లాండ్ వంటి ఫారిన్ లొకేషన్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చని చెప్పుకొచ్చారు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందేమో చూడాలి.


Recent Random Post: