ఓవైపు డిసెంబర్ వచ్చేసినా ఇంకా తుఫాన్ల బెడద విడిచిపెట్టడం లేదు. తెలుగు రాష్ట్రాలకు చేను కోతలకొచ్చిన ఈ అకాలంలో తుఫాన్లు ఏమిటో అంటూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బంగాళాఖాతంలో జవాద్ తుఫాన్ వచ్చినట్టే వచ్చి వెళ్లడం కాస్త ఊరట. అదంతా సరే కానీ.. మరో భారీ తుఫాన్ కి ప్రజలు సిద్ధంగా ఉండాలి.
అదేంటీ అంటే.. ప్రజలు కళ్లు కాయలు కాసేలా నాలుగున్నరేళ్లుగా వేచి చూస్తున్న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ముందే ఈ పెను తుఫాన్ విధ్వంశం ఉండనుంది. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ రూపంలో ఇది విరుచుకుపడనుంది. 2021 మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
మరో మూడు రోజులే.. ఇప్పటికే అభిమానుల గుండెల్లో లబ్ డబ్ బయటికే వినిపిస్తోంది. ఓవైపు చరణ్ అభిమానులు.. మరోవైపు తారక్ అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. బయ్యర్లు.. పంపిణీ వర్గాలు సహా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ ట్రైలర్ గురించే చర్చ. జస్ట్ ఇంకో మూడు రోజులే.
ఈ ట్రైలర్ తోనే ఆర్.ఆర్.ఆర్ రేంజ్ ఎలా ఉండబోతోందో ఒక అంచనాకు వచ్చేయొచ్చు. ఇప్పటికే టీజర్లు పోస్టర్లు ఓ ఉరుము ఉరిమాయి. ట్రైలర్ కుంభవృష్టిని కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రం 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
Recent Random Post: