ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన `ఆర్ ఆర్ ఆర్` పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి షోతోనే సినిమాకి అన్ని వైపాలా పాజిటివ్ సైన్ పడింది. తెలుగు రాష్ర్టాలు సహా ఓవర్సీస్ లో `ఆర్ ఆర్ ఆర్` వేగాన్ని ఇప్పట్లో ఆపడం అసాధ్యమని తేలిపోయింది. కొన్ని రోజుల పాటు `ఆర్ ఆర్ ఆర్` వసూళ్ల సునామీ కొనసాగిస్తుంది. తొలి షోతోనే `నాన్ బాహుబలి` కాదు..ఇక `నాన్ ఆర్ ఆర్ ఆర్` అని పిలవాల్సి ఉంటుందని `బాహుబలి `నిర్మాతే అనేసారు.
ఈసక్సెస్ ని రాజమౌళి అండ్ కో ముందే అంచనా వేసింది. అందుకే కార్పోరేట్ ఓటీటీ కంపెనీలు కోట్లు ఆఫర్ చేసినా థియటర్ లో మాత్రమే చూడాల్సిన సినిమా..ఓటీటీలో కాదంటూ ప్రేక్షకాభిమానులకు థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చారు. అప్పుడే ఫిక్స్ అయ్యారు. `ఆర్ ఆర్ ఆర్` ని 100డేస్ థియేటర్లో ఆడించాలని. అందుకే ఓటీటీ రిలీజ్ కూడా మూడు నెలలు తర్వాతే రిలీజ్ అయ్యేలే సదరు సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా థియేటర్ లో రిలీజ్ అయిన ఆరు వారాలు తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. నిర్మాతలతో కార్పోరేట్ కంపెనీలు అలాగే ఒప్పందం చేసుకుంటాయి. కానీ `ఆర్ ఆర్ ఆర్` మాత్రం మూడు నెలలు పాటు థియేటర్ లో ఆడించాలని జక్కన్న ఆ విధంగా ఒప్పందం చేసుకున్నట్లు తాజా సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది.
తెలుగు..తమిళం..హింధీ..కన్నడం..మలయాళం భాషల్లో `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఓటీటీ రిలీజ్ లో భాగంగా కొన్ని భాషల్లో జీ-5తో ఒప్పందం చేసుకుంది. హిందీ వెర్షన్ మాత్ర నెట్ ప్లిక్స్ తో డీల్ కుదుర్చుకుంది. కాబట్టి ఓటీటీలో `ఆర్ ఆర్ ఆర్` వీక్షించాలనుకునే వారు మూడు నెలలు పాటు వెయిట్ చేయాల్సిందే. మెజార్టీ వర్గం థియేటర్ లో నే సినిమా చూసే అవకాశం ఉంది.
తెలుగు లో ఉన్న థియేటర్లన్నీ దాదాపు `ఆర్ ఆర్ ఆర్` కే కేటాయించారు. అతికొద్ది థియేటర్లోనే `రాధేశ్యామ్` ఆడుతుంది. ఇప్పుడు వాటిని కూడా తొలగించే అవకాశం ఉంటుంది. హిట్ టాక్ వచ్చింది కాబట్టి `రాధేశ్యామ్` రన్నింగ్ కి ఇక పుల్ స్టాప్ పడినట్లే. `రాధేశ్యామ్` సినిమా కి నెగిటివ్ టాక్ వచ్చినా థియేటర్లు కేటాయించి ఆడిస్తున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించకపోవచ్చు.
`ఆర్ ఆర్ ఆర్` లో రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజు పాత్రలో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎం.ఎం కీరవాణీ సంగీతం అందించారు. డి. వివి. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.
Recent Random Post: