సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యంగ్ హీరోల నుండి మొదలుకుని బాలీవుడ్ హీరోయిన్స్ వరకు ఎంతో మంది మహేష్ బాబు ఫ్యాన్స్ జాబితాలో ఉంటారు అనడంలో సందేహం లేదు. ఇటీవల తానూ మహేష్ బాబు ఫ్యాన్ నే అంటూ ముద్దు గుమ్మ సాయి పల్లవి పేర్కొంది. తాను మహేష్ బాబు ఫొటోలు చూస్తున్న సమయంలో ఇంత అందంగా ఎలా ఉంటారు. అసలు ఇలాంటి స్కిన్ టోన్ ఎలా సాధ్యం అనిపిస్తుంది. అబ్బాయిలు ఇలాంటి స్కిన్ టోన్ కలిగి ఉండటం చిత్రంగా ఉందంటూ సాయి పల్లవి ఫన్నీగా మహేష్ బాబు అందంపై కామెంట్స్ చేసింది.
ఇటీవల సాయి పల్లవి ఒక బాలీవుడ్ మీడియా సంస్థతో చిట్ చాట్ చేసింది. ఆ సందర్బంగా మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అన్నట్లుగా చెప్పింది. నేను కొన్ని సార్లు మహేష్ బాబు గారి ఫొటోలు చూస్తున్న సమయంలో జూమ్ చేసి మరీ ఆయన స్కిన్ టోన్ ను చూస్తూ ఉండేదాన్ని అంది. ఆయన స్కిన్ షైనింగ్ గా ఉండటం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గతంలో కూడా పలువురు మహేష్ బాబు అందం గురించి మాట్లాడుతూ ఆయన స్కిన్ టోన్ వండర్ అన్నారు. ఇప్పుడు అదే విధంగా సాయి పల్లవి కూడా అదే మాట అంది.
Recent Random Post: