బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ కు ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సల్మాన్ హీరోగా సినిమా అంటే మినిమం 150 కోట్ల బడ్జెట్ అన్న విషయం తెల్సిందే. అయితే అంత బడ్జెట్ పెట్టినా కానీ తిరిగి తొలి వారానికే రాబట్టుకోగలగడమే సల్మాన్ ఖాన్ స్పెషలిటీ.
రీసెంట్ గా రాధే సినిమాతో బిజీగా ఉన్నాడు సల్మాన్. ఈ చిత్రం కాకుండా కభీ ఈద్ కభీ దీవాలి చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. ఈ రెండూ కాకుండా సల్మాన్ ఖాన్ తన బావ గారి కోసం ఒక చిత్రం చేస్తున్నాడు.
సల్మాన్ సోదరి అర్పిత భర్త ఆయుష్ శర్మ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయుష్ కోసం భారీ బడ్జెట్ సినిమా అయిన అంతిమ్ లో సల్మాన్ కీలక పాత్రను పోషించాడు. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. మహేష్ మంజ్రేకర్ ఈ సినిమాకు దర్శకుడు.
Recent Random Post: