దీపికను కాపీ కొడతానని ఒప్పుకున్న సామ్

శ్రీలంకలో నివశించే తమిళ తిరుగుబాటు యోధురాలు రాజలక్ష్మి(రాజీ) పాత్రలో నటనకు సమంతా అక్కినేనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ సామ్ నటనా నైపుణ్యం గురించి మాట్లాడుతున్నారు. మచ్చలేని నటనను ప్రశంసిస్తున్నారు. అయితే సమంతకు స్ఫూర్తి ఎవరు? ఫ్యాషన్ పరంగా నటన ఎదుగుదల పరంగా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది? అంటే… తాను బాలీవుడ్ ఫ్యాషనిస్టా దీపికకు పెద్ద ఫాలోవర్ ని అని తన నటన ఎదుగుదల ఫ్యాషన్స్ అండ్ స్టైలింగ్ గురించే ఎక్కువ ఆలోచిస్తానని తెలిపారు.

టాప్ మోడల్ గా అగ్ర హీరోయిన్ గా దీపిక సుదీర్ఘ అనుభవం తనదైన యూనిక్ స్టైలింగ్ ప్రతిసారీ సమంత మనసు దోచేశాయని నిజాయితీగా అంగీకరించారు. ఒక రకంగా దీపిక ను సామ్ ఫాలో చేస్తారు. తన స్టైల్స్ ని అనుకరించేందుకు ప్రయత్నిస్తారు. అందుకు సంబంధించిన రకరకాల సందర్భాలున్నాయి.

తాజాగా ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో..తనకు దీపికా పదుకొనేను కాపీ కొట్టడం తనకు ఇష్టమని ఒప్పుకున్నారు. దీపిక అసలు మానవ రూపంలో ఉన్న దేవతనా? అనే సందేహం కలిగిందట. తన ప్రభావం అంతగా ఉంటుందని అన్నారు. దీపిక చాలా అందంగా ఉంటుంది..మనుషుల్లో తను విభిన్నం. ఆమె వేరొక ప్రత్యేకత కలిగిన మనిషి అని నేను రహస్యంగా భావిస్తున్నాను అని సమంతా అక్కినేని ఉటంకించారు.

దీపికా పదుకొనేపై సమంత తన ప్రేమను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అలియా భట్- దీపికా పదుకొనే వంటి తారలు పెద్ద స్థాయిని కనబరిచిన తీరును ప్రశంసించారు. ప్రస్తుతం దీపికను సమంత అనుకరించిన రకరకాల సందర్భాలకు సంబంధించిన ఫోటోలు స్టైలింగ్ వైరల్ గా అభిమానుల్లో షేర్ అవుతున్నాయి.


Recent Random Post: