ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో లో సమంత దసరా స్పెషల్ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా వచ్చింది. ఆమె షో లు చేసిన సందడి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రతి ప్రశ్నకు కూడా ఆమె ఇచ్చిన సమాధానం మరియు ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్లెనేషన్ అన్ని కూడా ఆమె ను విజేతగా నిలిపాయి అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆమె పాతిక లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పిన విషయమై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాతిక లక్షలకు గాను చాంప్స్ ఎలీసే మార్గంలో నడిచి, ఏ నగరంలో ఆర్క్ డీ ట్రియోంఫ్ ని చూడవచ్చు అనే ప్రశ్నకు సమంత లైఫ్ లైన్ ఉపయోగించుకుని పారిస్ అంటూ సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం ను రివీల్ చేసే సమయంలో ఎన్టీఆర్ కొద్ది సేపు డ్రామా రక్తికట్టించే ప్రయత్నం చేశాడు. చివరకు ఆమె చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అంటూ ప్రకటించాడు. దాంతో తెగ ఆనందించిన సమంత నన్ను చిన్నప్పటి నుండి అమ్మ జీనియస్ అనేది. కాని నేను అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతున్నాను అంటూ మురిసి పోయింది. అందుకు ఎన్టీఆర్ బదులుగా అమ్మగారు నిన్న జీనియస్ అన్నారు.. నేను దాన్ని నిరూపించాను.. కనుక నా కాళ్లకు దండం పెట్టడం.. నా ఫొటో తీసుకు వెళ్లి పూజించడం వంటివి చేయవద్దంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న వారు అంతా గట్టిగా నవ్వేశారు. మొత్తానికి పాతిక లక్షలు గెలుచుకున్న సమంత షో కు ఫుల్ ఎనర్జిని ఇచ్చింది.
Recent Random Post: