మళ్లీ సమంత, పూజా ఫ్యాన్స్‌ మద్య రచ్చ

కొన్ని నెలల క్రితం పూజా హెగ్డే సోషల్ మీడియా పేజ్ లో సమంత పాత ఫొటో షేర్‌ చేసి ఆమెలో ఎప్పుడు అందాన్ని చూడలేదు అంటూ కామెంట్‌ చేయడం జరిగింది. వెంటనే స్పందించిన పూజా హెగ్డే తన అకౌంట్‌ హ్యాక్ అయ్యింది అంటూ పేర్కొంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. పూజా హెగ్డేను టార్గెట్‌ చేసిన సమంత అభిమానులు రచ్చ రచ్చ చేశారు. అభిమానులు వర్సెస్ అభిమానులు అన్నట్లుగా వార్‌ జరిగింది. అది జరిగి నెలుల గడుస్తున్న నేపథ్యంలో అంతా దాని గురించి మర్చిపోయారు.

మళ్లీ సమంత పూజా హెగ్డే అభిమానుల మద్య రచ్చ మొదలైంది. ఒక హీరోయిన్‌ అభిమానులు మరో హీరోయిన్‌ అభిమానులపై విమర్శలు చేయడం ట్రోల్స్‌ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో సమంత ఫేస్‌ ను ప్లాస్టిక్ ఫేస్‌ అంటూ పూజా హెగ్డే అభిమానులు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దాంతో సమంత అభిమానులు కూడా ఈ విషయంలో పూజా హెగ్డేను టార్గెట్‌ చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్‌ ఫ్యాన్స్‌ మళ్లీ కొన్ని రోజులు ఢీ అంటే ఢీ అన్నట్లుగా కొట్టుకోవడం ఖాయంగా అనిపిస్తుంది.


Recent Random Post: