
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు భాషలపై ఉన్న పట్టు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా దక్షిణ భారత భాషలతో పాటు హిందీపై కూడా మంచి కమాండ్ ఉంది. అంతే కాదు, RRR జపాన్ ప్రచార సమయంలో జపనీస్ కూడా నేర్చుకుని fluently మాట్లాడిన తారక్, అక్కడి అభిమానులను ఆకట్టుకున్నారు. భాషలపై ఇటువంటి ఆసక్తి, నేర్చుకునే సామర్థ్యం తారక్‌కి ప్రత్యేక గుర్తింపునిచ్చింది.
ఇతర హీరోలు ఎక్కువగా ఇంగ్లీష్‌కే పరిమితమవుతూ, స్థానిక భాషల్లో మాట్లాడేందుకు వెనుకాడుతుంటే, తారక్ మాత్రం అన్ని భాషల్లో ఆత్మవిశ్వాసంగా మాట్లాడడం ద్వారా తనను ప్రత్యేకంగా నిలబెట్టుకున్నాడు. ఆయన మంచి నటుడే కాకుండా, గొప్ప నేర్చుకునే వ్యక్తి అనే పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా నటుడు నవీన్ చంద్ర చేరారు. ఆయన తనకు ఎనిమిది భాషలు వచ్చాయని తెలియజేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. సౌత్‌లో అన్ని భాషల్లో సినిమాలు చేసిన నవీన్, ఆయా సినిమాలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటాడట. “ప్రతి సినిమా ద్వారా కనీసం పది మంది కొత్త ప్రేక్షకులు రావాలి” అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నానంటూ తెలిపారు.
హీరోగా సినీ పరిశ్రమలోకి వచ్చిన నవీన్ చంద్ర, అవకాశాలు తక్కువగా రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్ పాత్రలతోనూ తనదైన ముద్ర వేశారు. ఇటీవల మళ్లీ కొన్ని సినిమాల్లో హీరోగా కనిపించే అవకాశాలు రావడంతో వాటిని చక్కగా సమర్థించుకుంటున్నారు.
‘లెవెన్’ అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నారు. అలాగే త్వరలో కామెడీ జానర్‌లో సినిమాలు చేయాలన్న ఆసక్తి కూడా ఉన్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఆ శైలిని తాకలేదని, ఇప్పుడు అలాంటి కథలవైపు కూడా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. దీనితో పాటు ‘కాళీ’ అనే యాక్షన్ సినిమాలోనూ నటిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మరో సినిమా చేస్తున్నట్టు వెల్లడించారు.
Recent Random Post:















