శివాత్మిక రాజశేఖర్ గత కొన్ని రోజులుగా దుబాయిలో వివిధ ప్రాంతాల్లో దిగుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. అక్కడ ఈ అమ్మడి అందాల ఆరబోత నెక్ట్స్ లెవల్ లో ఉండటంతో ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తెలుగు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ ను మించి ఈమె పొట్టి డ్రస్ లు వేసుకోవడంతో అభిమానులు సైతం వావ్ అంటూ కామెంట్స్ పెట్టారు.
ఫోటోల గురించి చర్చ ఒక వైపు అయితే మరో వైపు సోషల్ మీడియా చిల్లర బ్యాచ్ కొందరు శివాత్మిక దుబాయి పారిపోయిందని.. అది కూడా ఊరికే కాకుండా ఒక బాయ్ ఫ్రెండ్ తో వెళ్లింది అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఆ ప్రచారం ఈమద్య కాలంలో మరీ పీక్స్ కు చేరింది. ఒకానొక సమయంలో సాధారణ జనాలు ఆ విషయాన్ని నమ్మాలా అనుకునే స్థాయికి ప్రచారం జరిగింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. మరియు కొన్ని వెబ్ మీడియాల్లో వస్తున్న కథనాలపై శివాత్మికకు చిరాకు వచ్చినట్లుగా ఉంది. అందుకే ఆ పుకార్లకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం తో పాటు పుకార్లకు పుట్టించిన వారికి ఒక్కటి పీకినట్లుగా సమాధానం ఇచ్చింది. దుబాయ్ పారిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారు.. అసలు నేను వెళ్లింది వీళ్లతో అంటూ తన తండ్రి.. తల్లి మరియు సోదరితో ఉన్న ఫోటోను షేర్ చేసింది.
వీళ్లతో నేను దుబాయికి వెళ్తే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించేసుకుంటున్నారు అన్నట్లుగా శివాత్మిక పోస్ట్ పెట్టింది. ఇప్పుడు చెప్పండి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు.. ఇంతకు దుబాయ్ పారిపోయి వచ్చింది నేనా లేదా శివానినా అంటూ శివాత్మిక ప్రశ్నించింది. నాన్ సెన్స్ అంటూ ఆ పుకార్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన వైపు నుండి ఎలాంటి డౌట్ లేకుండా క్లారిటీ ఇచ్చేసింది.
పాపం శివాత్మిక మరియు శివాని లు కుటుంబ సభ్యులతో దుబాయ్ వెళ్లి అక్కడ సరదాగా టైం గడుపుతూ ఉంటే కొందరు జనాలు మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. శివాత్మిక క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా వారి నోళ్లు మూతపడతాయా అనేది చూడాలి. శివాత్మిక హీరోయిన్ గా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.
శివాని కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉంది. ఇద్దరు కూడా తండ్రి రాజశేఖర్ మరియు తల్లి జీవిత ల వారసత్వం నిలబెడుతూ వారికి మంచి పేరు తెచ్చేందుకు కష్టపడుతున్నారు. ఉన్నత చదువులు చదివినా కూడా సినిమా పై ఆసక్తితో హీరోయిన్ గా నటించేందుకు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. సినిమాల్లో రాణించేందుకు వారసత్వం సరిపోదు కష్టపడాలి. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాగానే కష్టపడుతున్నారు. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా వీరికి ఖచ్చితం గా సక్సెస్ దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Recent Random Post: